బెంగళూరులో నూతన సంవత్సర వేడుకలు, భర్త ముందే, విదేశీ యువతితో, అరెస్టు !
బెంగళూరు: నూతన సంవత్సర వేడుకల సందర్బంగా బెంగళూరు నగరంలో మళ్లీ కీచికపర్వం కొనసాగడంతో యువతులు ఉలిక్కిపడ్డారు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం మత్తులో కొందరు యువకులు యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కొందరు యువకులు మాత్రం మేము మారం ఇంతే అన్నట్లు వ్యవహరించారు.

గత సంవత్సరం !
గత ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో జరిగినట్లే ఈ సారి కూడా కొందరు యువకులు మద్యం మత్తులో యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. నూతన సంవత్సరం సందర్భంగా గత ఏడాది బెంగళూరులో యువతులపై లైంగిక వేధింపులు జరగిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా !
గత ఏడాది బెంగళూరు నగరంలోని ఎంజీరోడ్డు, బ్రిగేడ్ రోడ్డుతో పాటు బెంగళూరులో కొందరు యువతులు లైంగిక వేదింపులకు గురి కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. బెంగళూరులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొంటే లైంగిక వేధింపులు తప్పవు ? అనే విమర్శలు వచ్చాయి.

అర్దరాత్రి !
ఆదివారం అర్ధరాత్రి బెంగళూరు నగరం నడిబొడ్డున ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్డులో పెద్ద ఎత్తున యువతీ యువకులు గుమికూడి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. నూతన సంవత్సర వేడుకలు పూర్తి అయిన తరువాత యువతులు ఇళ్లకు తిరిగివెలుతున్న సమయంలో మద్యం మత్తులో కొంతమంది యువకులు మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.

విదేశీ యువతితో !
విదేశీ యువతని పదేపదే తాకేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు పట్టుకుని ఆ యువతికి క్షమాపణ చెప్పాలని సూచించారు. మొదట క్షమాపణలు చెప్పడానికి ఆ యువకుడు నిరాకరించాడు. విదేశీ యువతికి క్షమాపణలు చెప్పడానికి నిరాకరిస్తే క్రిమినల్ కేసు పెడతామని పోలీసులు హెచ్చరించడంతో అతను యువతి కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పి క్రిమినల్ కేసు నుంచి తప్పించుకున్నాడు.

భర్త ఎదురుగానే
బ్రిగేడ్ రోడ్డులో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో యువతి యువకులతో పాటు దంపతులు పాల్గొన్నారు. భర్త ఎదురుగానే అతడి భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

60 మంది అరెస్టు
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని యువతులను వేధింపులకు గురి చేసిన వారిని, పిక్ ప్యాకెటర్లు, దొంగలతో పాటు 60 మందిని అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి సీమంత్ కుమార్ సింగ్ చెప్పారు. ఎంజీ రోడ్డు, బ్రిగేడ్ రోడ్డులో 1, 500 మంది పోలీసులు నూతన సంవత్సర వేడుకలకు భద్రత కల్పించారని సీమంత్ కుమార్ సింగ్ వివరించారు.

హోం మంత్రి క్లారిటీ
2018 నూతన సంవత్సర వేడుకల్లో బెంగళూరు నగరంలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగలేదని కర్ణాటక హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి మీడియాకు చెప్పారు. గత సంవత్సరం జరిగిన సంఘటనలు గుర్తు పెట్టుకుని అలాంటి సంఘటనలు మరోసారి జరకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, కొందరు యువకులు మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించారని హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి వివరించారు.
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications