రోజుకి రెండు సార్లు ఆరేళ్లు కూతురిపై రేప్: జీవిత ఖైదు

ముంబై: తండ్రే కన్న కూతురికి కాలయముడయ్యాడు. ముంబై మహానగరంలో బాంద్రా ప్రాంతంలో నివసిస్తున్న 60 సంవత్సరాల తండ్రి తన కూతురుపై గత ఆరు సంవత్సరాల పాటు అత్యాచారం చేశాడు. . ఈ ఘటనలో ఆ తండ్రికి కోర్టు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పునిచ్చింది.

ఈ ఘటన సభ్యసమాజం తల దించుకునే విధంగా ఉందని ఈ కేసులో తీర్పు చెప్పిన స్పెషల్ జడ్జి విషాలి జోషీ అన్నారు. ఆరు సంవత్సరాల పాటు తన కూతురిపై రోజుకి రెండు సార్లు అత్యాచారం చేశాడు. ఇండియన్ పీనల్ కోడ్ సీనియర్ సిటిజన్ క్రింద 376 (2) (ఎఫ్) (గార్డియన్ లేదా గురువు, మహిళను కట్టేసి రేప్ చేయడం), 323 (స్వచ్ఛందంగా అమెకు హానిచేయడం) లాంటి నేరారోపణలతో అతనికి శిక్షపడినట్లు తెలిపారు.

60-year-old gets life imprisonment till death for raping daughter in Mumbai

శిక్ష పడిన అపరాధి భవనంలో రోజూ వారీ కూలీగా పనిచేస్తూ అదే బిల్డింగ్‌పై భాగంలో తన నలుగురు పిల్లలతో నివసిస్తూ వచ్చాడు. అతని భార్య కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయింది. అత్యాచారానికి గురైన అతని కూతురు వయసు 10 సంవత్సరాలు. ఈ అమ్మాయి నాల్గవ తరగతి చదువుతుంది. ఇంట్లో ఎవరూ లేని అదును చూసుకోని కూతురుపై అత్యాచారం చేస్తూవచ్చాడు. కూతురు వద్దని ప్రయత్నించినా, కొట్టి బలవంతంగా లోబరుచుకునేవాడు.

సంవత్సరం క్రితం ఒక పాపకు కూడా జన్మనిచ్చినట్లు తెలిపారు. కూతురు చదువుని కూడా మధ్యలోనే ఆపేసి బయటకు కూడా వెళ్లనిచ్చేవాడు కాదు. గత మార్చిలో నిర్మల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+