వృద్ధురాలిపై ఘాతుకం, కత్తితో పొడిచి, తల నరికి, పొట్ట చీల్చి..పాతకక్షలేనా..?

నేరాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నగల కోసం దాడులు, హత్యలు జరుగుతుంటాయి. కానీ పశ్చిమబెంగాల్‌లో ఓ వృద్దురాలిని దుండగులు దారుణంగా మట్టుబెట్టారు. కానీ ఇంట్లో ఉన్న నగలు, తీసుకోకపోవడంతో ఎవరూ హత్య చేశారనే అంశం పోలీసులు కూపీ లాగుతున్నారు. హత్య జరిగిన సమయంలో వృద్ధురాలి ఇద్దరు కుమారులు ఇంట్లో లేకపోవడం.. దుండగులకు కలిసొచ్చింది.

కుమారులతో కలిసి

కుమారులతో కలిసి

పంజాబ్‌కి చెందిన ఉర్మిళ కుమారి (60) కోల్‌కతాలో ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వారు రెండురోజుల క్రితం తమ స్వగ్రామానికి వెళ్లారు. పెళ్లి కోసమవని వారు వెళ్తే.. తల్లి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. కుమారులు ఇంట్లో లేరని తెలుసుకున్న దుండగులు వృద్ధ మహిళను దారుణంగా హతమార్చారు.

నగలు తీసుకోలేదు..

నగలు తీసుకోలేదు..

ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు నగలు ఏమీ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో పాత కక్షల వల్లే హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కానీ వార్డ్ రోబ్‌ల్లో ఉన్న నగదును మాత్రం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. కానీ మహిళను అంత దారుణంగా హతమార్చడంపై పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. హత్య ఎవరు చేశారనే అంశాన్ని త్వరలోనే కనుక్కొంటామని చెప్పారు.

ఎవరి పని

ఎవరి పని

ఇంట్లోకి ప్రవేశించిన దుండుగులకు మహిళతో మాట మాట పెరిగి ఉంటుంని, దీంతో విచక్షణ కోల్పోయిన వారు కత్తితో పొడిచారని పోలీసులు తెలిపారు. తల నరికేసి, పొట్ట భాగాన్ని చీల్చారని వెల్లడించారు. మహిళపై వారు అంత దారుణంగా ప్రవర్తించడంతో హత్య చేసింది ప్రొఫెషనల్ కిల్లర్స్ లేదంటే పాతకక్షలతో జరిగిందా అని పోలీసులు భావిస్తున్నారు.

ఇదే కారణమా..

ఇదే కారణమా..

ఇది ఇలా ఉంటే ఇటీవల మహిళ ఇంటి పక్కన మద్యం షాపు తెరిచారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎవరెవరు వచ్చి మందు కొనుగోలు చేస్తున్నారని.. నేరప్రవృత్తి కలిగినవారికి అడ్డగా మారిందని చెప్తున్నారు. ప్రతీ నిత్యం ఇబ్బంది ఉందని, దీనిపై గరియాహట్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని కాలనీవాసులు చెప్తున్నారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+