14ఏళ్ల బాలికపై 60ఏళ్ల వృద్దుడి రేప్: కడుపునొప్పి అని వెళ్తే.. గర్భవతిగా!
వేలూరు: ఓ మైనర్ బాలికపై 60ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఆసరా చేసుకుని ఆమెపై వృద్దుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆమె తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని అంబూరు సమీప గ్రామానికి చెందిన ఓ కూలీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దమ్మాయికి ఇటీవలే వివాహం జరిపించగా.. 14ఏళ్ల చిన్న కుమార్తె ఇంటి వద్దే ఉంటోంది. ఇటీవల బాలికకు తీవ్ర కడపునొప్పి రావడంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యుడు ఆమె గర్భవతి అని నిర్దారించాడు.
ఈ విషయంపై బాలికను గట్టిగా ప్రశ్నించగా.. తమ గ్రామానికే చెందిన పండ్ల వ్యాపారి సలీం(60) తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. ఆపై వైద్యుడు జయరాం సూచన మేరకు పేర్నాంబట్టులోని జయలక్ష్మి అనే మహిళ వద్దకు వెళ్లి బాలికకు అబార్షన్ చేయించారు.

అప్పటినుంచి బాలిక తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో.. ఆమె తల్లిదండ్రులు సలీంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సలీంకు నలుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నట్లు తెలిపారు. బాధిత బాలిక కుటుంబంతో సలీంకు చాలాకాలంగా పరిచయం ఉందని, తరుచూ వారి ఇంటికి వెళ్తుండేవాడని అన్నారు.
కాగా, ఈ కేసులో నకిలీ వైద్యులు జయపాల్, జయలక్ష్మిలను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న సలీంను కూడా బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications