ఆఫీసుకు పిలిచి 22 ఏళ్ల యువతిపై సహోద్యోగి రేప్

థానే: ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంత కఠినమైన చట్టాలు వచ్చినా మగాళ్ల బుద్ధులు మారేట్లు లేవు. 61 ఏళ్ల వ్యక్తి 22 ఏళ్ల సహోద్యోగిపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు మంగళవారంనాడు చెప్పారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో గల కాల్వా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

61-year-old held for raping 22-year-old colleague

కాల్వా పోలీసు స్టేషన్ ఎపిఐ జిడి గవ్తే కథనం ప్రకారం - నిందితుడిని కీర్తికుమార్‌గా గుర్తించారు. అతను ఫిబ్రవరి 1వ తేదీన పని ఉందని చెప్పి యువతిని కార్యాలయానికి పిలిచాడు. కార్యాలయానికి వచ్చిన ఆమెను ఒంటరి ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఆమెపై అతను అత్యాచారం చేశాడు.

యువతిని అతను కొట్టడమే కాకుండా ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఈ విషయాన్ని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపిసి 376, 323, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+