12ఏళ్ల బాలికపై 62ఏళ్ల వృద్దుడు 'రేప్'యత్నం: కేకలు పెట్టడంతో చితక్కొట్టారు..

ఆ సమయంలో బాలిక తల్లి షాపింగ్ నిమిత్తం బయటకు వెళ్లడంతో.. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. దీంతో ఇంటి డోర్ లాక్ చేసిన వృద్దుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

బెంగళూరు: 12ఏళ్ల ఓ చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టబోయిన 62ఏళ్ల వృద్దుడికి జనం దేహశుద్ది చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను వృద్దుడు లైంగికంగా వేధించడంతో.. బాలిక కేకలు పెట్టింది. దీంతో విషయం గమనించిన స్థానికులు.. వృద్దుడిని రోడ్డు పైకి లాక్కొచ్చి చితక్కొట్టారు. బెంగళూరులోని చంద్రా లేఔట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. చంద్రా లేఔట్ లో చిన్నరామయ్య అనే రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. బాధిత బాలిక కుటుంబం కూడా అతని ఇంటికి కొద్ది దూరంలోనే ఉంటుంది. ఇరు కుటుంబాలకు మధ్య చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. ఇదే క్రమంలో ఆదివారం మధ్యాహ్నాం పూట చిన్నరామయ్య.. బాలిక ఇంటికెళ్లాడు.

 62-year-old govt employee held for sexually harassing 12-year-old

ఆ సమయంలో బాలిక తల్లి షాపింగ్ నిమిత్తం బయటకు వెళ్లడంతో.. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. దీంతో ఇంటి డోర్ లాక్ చేసిన వృద్దుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు పెట్టింది. విషయం గమనించిన స్థానికులు.. వెంటనే ఇంట్లోకి వెళ్లి వృద్దుడిని బయటకు లాక్కొచ్చారు. ఆపై అతనికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు అతనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదైంది. మరోవైపు నిందితుడి భార్య సైతం పోలీస్ కేసు నమోదు చేయడం గమనార్హం. తమ ఇంట్లోకి చొరబడి తనపై, తన భర్తపై బాలిక కుటుంబ సభ్యులు దాడి చేశారని ఫిర్యాదులో ఆమె ఆరోపించింది. దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+