కడుపులో 639మేకులు: అయస్కాంతం ఉపయోగించి తొలగించారు..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి కడుపు నుంచి ఏకంగా 639మేకులు బయటపడ్డాయి. వైద్యులు అతన్ని సురక్షితంగా రక్షించగలిగారు. కోల్‌కతాలోని ఉత్తర 24 పరగణా జిల్లాలో గోబర్దంగా ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి కడుపు నుంచి ఏకంగా 639మేకులు బయటపడ్డాయి. వైద్యులు అతన్ని సురక్షితంగా రక్షించగలిగారు. కోల్‌కతాలోని ఉత్తర 24 పరగణా జిల్లాలో గోబర్దంగా ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల ఆ వ్యక్తి స్క్రీజోఫ్రెనియాతో బాధపడుతున్నట్టు గుర్తించారు.
మేకులు, మట్టి ఎక్కువగా తినేయడంతో ఇటీవల అతనికి కడుపు నొప్పి ఎక్కువైంది. దీంతో కోల్ కతా మెడికల్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు దాదాపు రెండు గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స చేసి 639మేకులను బయటకు తీశారు.

కడుపు దగ్గర చిన్న గాటు పెట్టి అయస్కాంతం సాయంతో వాటిని బయటకు తీశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.
మెడలో దిగిన బాణం:
పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న మరో ఘటనలో ఓ బాలిక మెడలో బాణం దిగింది. బిర్‌భమ్ జిల్లాలోని సాయ్(స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా) సెంటర్‌లో ప్రమాదవశాత్తూ ఫజిల్లా ఖాటూన్ అనే బాలిక మెడలో బాణం గుచ్చుకుంది.
జువెల్ షేక్ అనే ఆర్చర్ సాధన చేస్తున్న సమయంలో.. అక్కడే ఉన్ యువ ఆర్చర్ ఖాటూన్ మెడలోకి బాణం దూసుకెళ్లింది. అయితే ఫజిల్లా ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు వెల్లడించారు. ఏమరపాటుగా ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications