ఆరోగ్య శాఖా మంత్రికి షాక్: అనుచరుడి ఇంట్లో రూ. కోట్లు సీజ్ !

తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి మంత్రి విజయభాస్కర్ కు అత్యంత సన్నిహితుడైన నినార్ ఇంటిలో ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ. 2.2 కోట్ల నగదు సీజ్ చేశారు. మంత్రి ఇంటిలో కూడా భారీ మొత్తంలో నగదు సీజ్ చేశారని సమాచారం

చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ చిక్కుల్లోపడ్డారు. మంత్రి విజయభాస్కర్ ఇల్లు, కార్యాలయాల్లో శుక్రవారం వేకువ జామున నుంచి ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు చేస్తున్నారు.

మంత్రి విజయభాస్కర్ స్నేహితులు, బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంత్రి విజయభాస్కర్ కు అత్యంత సన్నిహితుడైన నినార్ ఇంటిలో ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ. 2.2 కోట్ల నగదు సీజ్ చేశారు.

64th National Awards: Complete List of the Winners

నినార్ ఇంటిలో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎందుకు పెట్టారు, ఎక్కడి నుంచి రూ. 2.2 కోట్లు తీసుకు వచ్చారు అంటూ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి విజయభాస్కర్ ఇంటిలో భారీ మొత్తంలో నగదు సీజ్ చేశారని తెలిసింది.

అయితే మంత్రి విజయభాస్కర్ ఇంటిలో ఎంత మొత్తంలో నగదు సీజ్ చేశారు ? అనే విషయంపై ఇప్పటి వరకూ ఆదాయపన్ను శాఖ అధికారులు నోరువిప్పడం లేదు. సోదాలు పూర్తి అయిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆదాయ పన్ను శాఖ అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+