చికిత్స చేస్తానని వైద్యుడి రాసలీలలు, వీడియోలు, బ్లాక్ మెయిల్ 16 మంది జీవితాలు!
బెంగళూరు: చికిత్స చేస్తానని మైనర్లు, యువతులను నమ్మించి వారిని లొంగదీసుకుని రాసలీలలు జరిపి తిరిగి వారినే బ్లాక్ మెయిల్ చేస్తున్న వైద్యుడి గట్టురట్టు వెలుగు చూసింది. కర్ణాటకలోని మంగళూరు నగరంలో వైద్యుడి కామపురాణంను ఓ యువతి ధైర్యంగా బయటపెట్టడంతో 16 మంది యువతులు వీడియోలు వెలుగు చూశాయి.
కేరళకు చెందిన శశి (65) అనే కామాంధుడు మంగళూరులో కొన్ని ఏళ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. వైద్యం చేయించుకోవడానికి తన వద్దకు వచ్చే మైనర్లు, అమ్మాయిలను లొంగదీసుకుంటున్న శశి తన కామవాంచ తీర్చుకుంటున్నాడు. యువతులతో రాసలీలలు నిర్వహించే సమయంలో వారికి తెలీకుండా వీడియోలు తీశాడు.

ఆ వీడియోలు బాధితులకు చూపించి పదేపదే మళ్లీ యువతులతో శశి కామవాంచ తీర్చుకుంటున్నాడు. శశి కళ్లుగప్పిన ఓ బాధితురాలు అతని మొబైల్ లో ఉన్న చిప్ తీసుకుని ఎన్ జీఓ కార్యకర్త శ్రీలతకు ఇచ్చారు. శ్రీలత వైద్యుడు శశి దగ్గరకు వెళ్లి అతన్ని ముగ్గులోకి దింపింది.
శశి నిజంగా తన కోసం వచ్చిందని నమ్మి శ్రీలతతో సరసాలు ప్రారంభించాడు. శ్రీలత ఖద్రి పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని అడ్డంగా పట్టించింది. కామాంధుడైన వైద్యుడు శశి కారణంగా సుమారు 16 మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
తన ఆసుపత్రిలో శ్రీలత చోరీ చేసిందని వైద్యుడు శశి ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించి విచారణ చేస్తున్నారు. వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చినా వైద్యుడు శశిని ఇంత వరకు అరెస్టు చెయ్యలేదని బాధితులు పోలీసుల మీద మండిపడుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications