కరోనా: 68 మంది వైద్యులు, నర్సులు క్వారంటైన్, కరోనా లక్షణాలతో గర్భిణీ మృతి...
ఢిల్లీ భగవాన్ మహావీర్ ఆస్పత్రి వైద్యులు, నర్సులు 68 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ఓ గర్భిణీ బుధవారం రాత్రి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో చనిపోయారు. దీంతో మొత్తం 68 మందిని క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు స్పష్టంచేశారు.
వాయవ్య ఢిల్లీకి చెందిన గర్భిణీ సోమవారం ఆస్పత్రిలో చేరారు. ఆమె ఇటీవల విదేశాల నుంచి వచ్చారని తెలుస్తోంది. హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించిన విషయాన్ని తమ వద్ద దాచారని ఆస్పత్రి సిబ్బంది ఆరోపిస్తున్నారు. తమకు తప్పుడు సమాచారం ఇచ్చి ఆమె దవాఖానలో చేరారని పేర్కొన్నారు. కానీ బుధవారం ఆమె పరిస్థితి మరింత విషమించింది. వెంటిలెటర్ మీద చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.

కానీ తర్వాత విదేశాల నుంచి వచ్చానని.. తనకు అక్కడ కరోనా వైరస్ బారిన పడినవారితో పరిచయం ఏర్పడిందని తెలియజేశారు. తన కుటుంబానికి చెందిన నలుగురు ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు క్వారంటన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారని గుర్తుచేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బందిలో గుబులు నెలకొంది. ఆ మహిళతో కాంటాక్ట్‌లో ఉన్న సిబ్బంది అందరినీ క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.
Recommended Video
కరోనా వైరస్ సోకిన ఆరోగ్య కార్యకర్తల్లో 45 మంది ఢిల్లీకి చెందినవారు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గర్బిణీకి వైరస్ ఉందా అనే విషయం శుక్రవారం స్పష్టత వస్తోంది. ఆమెకు వైరస్ ఉంటే.. వైద్య సిబ్బంది విధిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందే. లేదంటే మాత్రం క్వారంటైన్ నుంచి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications