4 రోజుల్లో ఆరో అత్యాచారం: పట్టపగలు కాలేజీ విద్యార్థినిని కారులోకి లాగేసుకుని..
గుర్గావ్: హర్యానాలో అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ వారంలోనే వరుసగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు చోటుచేసుకున్నాయి. తాజాగా గుర్గావ్‌లోని ఫరూఖ్‌నగర్‌లో ఓ కాలేజీ విద్యార్థినిపై అఘాయిత్యం జరిగింది. గత 4 రోజుల్లో ఇది ఆరో ఘటన కావడం సంచలనం కలిగిస్తోంది.
వివరాల్లోకి వెళితే... గుర్గావ్‌లోని ఫరూఖ్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థిని కాలేజీ నుంచి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తన ఇంటికి తిరిగొస్తోంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఆమెను అడ్డగించారు.
Recommended Video


ఆ విద్యార్థిని ప్రతిఘటించినా వారి పశుబలం ముందు ఫలితం లేకపోయింది. ఆమెను తమ కారులోకి లాగేసుకుని కారును అతి వేగంగా నడిపిస్తూ క్షణాల్లో అక్కడ్నించి మాయమయ్యారు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.
రోడ్డు పక్కనే కారాపి, ఆ విద్యార్థినిని బలవంతంగా సమీపంలోని తుప్పల్లోకి తీసుకెళ్లి, నగ్నంగా మార్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నగ్నంగానే ఆమెను సమీపంలోని ముషాయిద్‌పూర్ గ్రామ సమీపానికి కారులో తీసుకెళ్లి బయటికి తోసేశారు.
కన్నీటి పర్యంతమైన ఆ విద్యార్థిని జరిగిన అఘాయిత్యం గురించి ఎవరికీ చెప్పనంటూ హామీ ఇచ్చాకే ఆమె దుస్తులు విసిరేసి వెళ్లిపోయారు. ఇంటికి తిరిగొచ్చాక జరిగినదంతా ఆమె తన తండ్రికి చెప్పడంతో గురువారం స్థానిక పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
హర్యానాలో జనవరి 13 నుంచి వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫరూఖ్‌నగర్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచరం ఘటన.. గత నాలుగు రోజుల్లో జరిగిన ఆరో అత్యాచారం.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications