విషాదం: నదిలో పడిపోయిన భారత సైనికుల వాహనం, ఏడుగురు జవాన్లు మృతి

శ్రీనగర్: లడఖ్‌లోని తుర్టుక్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లడఖ్‌లోని తుర్టుక్ సెక్టార్‌లోని ష్యోక్ నదిలో భారత సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పడిపోవడంతో కనీసం ఏడుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. వాహనం దాదాపు 50-60 అడుగుల లోతులో పడిపోయింది.

'26 మంది సైనికులతో కూడిన బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళుతోంది. వాహనం రోడ్డుపై నుంచి స్కిడ్ అయి ష్యోక్ నదిలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న వారందరికీ గాయాలు అయ్యాయి' అని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

7 Indian Soldiers Martyred In Vehicle Accident In Ladakhs Turtuk, Several Injured

మొత్తం 26 మంది సైనికులను ఆర్మీ ఫీల్డ్ ఆసుపత్రికి తరలించారు. లేహ్ నుంచి శస్త్రచికిత్స బృందాలను పార్తాపూర్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురు సైనికులు మరణించారని అధికారులు తెలిపారు.

గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సంరక్షణ అందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తీవ్రగాయాలపాలైన పలువురు సైనికులను వాయుమార్గం గుండా వెస్ట్ కమాండ్ తరలించేందుకు వైమానిక దళం సాయం కోరినట్లు భారత సైన్యం తెలిపింది.

బాధాకరం: ప్రధాని మోడీ

'లడఖ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో మన వీర సైనిక సిబ్బందిని కోల్పోయామని బాధపడ్డాను. నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తున్నాం’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+