బాబా ఆలయంలో ఘోరం: ఏడుమంది దుర్మరణం: ప్రాణాపాయ స్థితిలో పలువురు భక్తులు
Bihar Stampede: బిహార్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆలయంలో సంభవించిన తొక్కిసలాటలో ఏడుమంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
బిహార్ జెహనాబాద్ జిల్లా మఖ్దూంపూర్‌లో గల ప్రాచీన సిద్ధాంత్ బాబా ఆలయంలో కొద్దిసేపటి కిందటే ఈ దుర్ఘటన సంభవించింది. శ్రావణ మాసం సోమవారం కావడం వల్ల ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ తెల్లవారు జామున 4 గంటల నుంచే ఆలయం వద్ద బారులు తీరి నిల్చున్నారు.

భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చిన తరువాత ఒక్కసారి ఆలయంలోనికి వెళ్లడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట సంభవించింది. భక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. పలువురు కిందపడటం, వెనుక ఉన్న వారు ముందుకు దూసుకుని రావడం వంటి ఘటనలు చకచకా జరిగిపోయాయి. దీనితో కిందపడ్డ భక్తులు వారి కాళ్ల కింద నలిగిపోయారు.
ఈ ఘటనలో ఏడుమంది మరణించారు. తొమ్మిదిమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని మఖ్దుంపూర్, జెహనాబాద్ ఆసుపత్రులకు తరలించారు.
జెహనాబాద్ జిల్లా కలెక్టర్ అలంకృత పాడే, సబ్ డివిజినల్ పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ కుమార్, మఖ్దూంపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దివాకర్ కుమార్ విశ్వకర్మ.. ఇక్కడి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు. ఏడుమంది మరణించినట్లు ధృవీకరించారు. మృతుల కుటుంబీకులకు ఈ సమాచారం తెలియజేసినట్లు వెల్లడించారు.
#WATCH | Bihar: Divakar Kumar Vishwakarma, SHO Jehanabad says, "DM and SP visited the spot and they are taking stock of the situation...A total of seven people have died...We are meeting and inquiring the family members (of the people dead and injured)...We are trying to identify… https://t.co/yw6e4wzRiY pic.twitter.com/lYzaoSzVPH
— ANI (@ANI) August 12, 2024
అంచనాలకు మించిన స్థాయిలో భక్తులు ఆలయానికి రావడం, ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆలయ కమిటీ ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు, గాయపడ్డ భక్తుల బంధువులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications