నమ్మకమే శక్తి, నమ్మకమే బలం, నమ్మకమే జీవితం: హీరో ఉపేంద్ర ట్వీట్ వైరల్, జీవితంలో !

బెంగళూరు: ప్రజలే ప్రభువులు, రాజకీయ నాయకుల్లో రాజులు ఉండరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బహుబాష నటుడు, దర్శకుడు, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది.

రాజకీయాలు వదలండి, ప్రజల కోసం ప్రజాకీయం చెయ్యండి అనే సందేశంతో ఇటీవల తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఉపేంద్ర చెప్పిన విషయం తెలిసిందే. గత శనివారం నుంచి కర్ణాటకలో ఉపేంద్ర కొత్త పార్టీ గురించే జోరుగా చర్చ జరుగుతోంది.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా మంగళవారం ఉపేంద్ర కన్నడలో ఓ ట్వీట్ చేశారు. అందులో ప్రజలను ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం అంటే బ్రిటీష్ వారు మన దేశాన్ని వదిలి స్వేచ్చ ఇచ్చి వెళ్లిపోయారని అందరికీ తెలుసని గుర్తు చేశారు.

 71st independence Day check out Actor Upendra tweet

ప్రస్తుతం అపనమ్మకం, అనుమానం, ఆలస్యం నుంచి మనల్ని విడుదల చెయ్యాలి. అప్పుడే ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చినట్లు అవుతుందని వివరించారు. డబ్బు, కులం, మతం కనిపించని ప్రజాకీయ పార్టీ మనకు ఇప్పుడు ఎంతో అవసరం అనే ఐడియా ఓకే అని చెప్పిన ఉపేంద్ర తరువాత అయితే అన్నారు.

అయితే అనే పదం మన జీవితాల నుంచి పూర్తిగా బయటకు తీసివేయాలని అవుతుంది అనే నమ్మకం పెట్టుకోవాలని ఉపేంద్ర అన్నారు. నమ్మకమే శక్తి, నమ్మకమే బలం, నమ్మకమే జీవితం అంటూ వివరిస్తూ దేశ ప్రజలు అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ ముగించారు. ఉపేంద్ర చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఎమైనా ఉపేంద్రకు ఎవ్వరూ సాటిరారు అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+