కేరళలో ఢీకొన్న పడవలు: 8 మంది మృతి
కొచ్చి: కేరళలో రాజధాని కొచ్చిలో బుధవారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటన మధ్యాహ్నాం 1.45 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న పడవను మత్స్యకారలు వెళ్తున్న పడవ ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల పడవ రెండుగా చీలిపోగా, నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం 8 మంది మృతి చెందారు.
ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది వరకూ ప్రయాణికులు పడవలో ఉన్నారు. ప్రమాంద జరిగిన వెంటనే 30 మంది ప్రయాణికులను రక్షించి కొచ్చి తాలుకూ ఆసుపత్రి, ఎర్నాకుళం మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రికి మరికొందరిని తరలించి చికిత్సనందిస్తున్నారు.

ప్రయాణికుల పడవ ఫెర్రీ పోర్డ్ నుంచి వ్యాపిన్ వెళుతుండగా, మార్గమధ్యంలో అదుపుతప్పిన మత్స్యకారుల పడవ ఒకటి బలంగా ఢీకొన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
కోస్టుగార్డు సిబ్బంది, ఫైర్ సిబ్బందితో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారు.












Click it and Unblock the Notifications