గ్యాంగ్ రేప్, యోనిలో కర్రలు, రాళ్లు, కండోమ్స్: 8 మంది అరెస్టు
రోహతక్: అత్యంత దారుణమైన రోహతక్ సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. యోనిలో కర్రలు, రాళ్లు, కండోమ్స్ దూర్చిన స్థితిలో, సగం పీక్కు తిన్న స్థితిలో మహిళ శవం ఇటీవల బయటపడింది. ఆమెపై అత్యాచారం చేసి, ఆమెను చంపేసినట్లు నిందితులు అంగీకరించినట్లు సమాచారం.
28 ఏళ్ల నేపాలీ మహిళ శవాన్ని జంతువులు పీక్కు తిన్నాయి. రెండు చేతులు, శరీరంలోని ఎడమ భాగం కనిపించకుండా పోయాయి. ఆమె యోనిలో రాళ్లు, కర్రలు, కండోమ్స్ దూర్చినట్లు పోలీసులు చెప్పారు. ఇంతటి దారుణమైన కేసును తన 30 ఏళ్ల జీవితంలో చూడలేదని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ అన్నారు. బలమైన వస్తువుతో ఆమె తలపై మోదారని, ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారని, ఎలుకలు ఆమె శరీరాన్ని తిన్నాయని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ చెప్పారు.

అరెస్టయిన ఎనిమిది మంది కూడా రోహతక్ సమిపంలోని గ్రామానికి చెందినవారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2012లో ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కన్నా ఘోరమైన అత్యాచారంగా దీన్ని భావిస్తున్నారు.
ఆ మహిళ శవం ఫిబ్రవరి 4వ తేదీన లభ్యమైంది. అంతకు మూడు రోజుల ముందు ఆమె కనిపించకుండా పోయిందని ఆమె సోదరి ఫిర్యాదు చేసింది. పోలీసులు తన ఫిర్యాదును తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదని, వెతుకుతున్నామని సమాధానం ఇచ్చారని, పోలీసులు సరిగా వ్యవహరించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అన్నట్లు జాతీయ మీడియా రాసింది. తన సోదరిని హత్య చేసినవారిని ఉరి తీయాలని ఆమె అంటోంది.
హతురాలు మూడు నెలల క్రితం నేపాల్ నుంచి వచ్చింది. తన సోదరితో ఉంటూ మానిసక వైద్యం చేయించుకుంటోంది. అరెస్టయినవారిలో ఒకతను నేపాల్ జాతీయుడని పోలీసులు చెప్పారు. పోలీసుల వైపు నుంచి ఏమైనా లోపం జరిగి ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని డిజిపి యశ్పాల్ సింఘాల్ అన్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications