ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం..8మంది మృతి..
సోమవారం అర్థరాత్రి ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బొలెరో వాహనం 200 మీటర్ల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కూలీలు మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలోని బేతాల్‌ఘాట్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని ఉంచకోట్ ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. వీరంతా నేపాల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. నేపాల్ మూలానికి చెందిన పది మంది వ్యక్తులను పని నిమిత్తం తనక్‌పూర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో బొలెరో అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డుపై నుంచి 200 మీటర్ల లోతైన గుంతలో పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే, అర్థరాత్రి కావడం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు కాస్త కష్టమైందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను ప్రమాదంలో గాయపడిన వారందరినీ పోలీసులు బయటకు తీశారు. ఏడుగురు స్పాట్‌లోనే చనిపోగా, చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. బొలేరో మొత్తం పది మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. డ్రైవర్‌తో సహా 8 మంది మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రక్రియను చేపట్టారు.

పనికెళ్తూ.. తిరిగొస్తుండగా ప్రమాదం..
వీరంతా జల్ జీవన్ మిషన్ కింద పని చేయడానికి తనక్‌పూర్‌లోని ఉంచకోట్‌కు వచ్చారు. పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరం ప్రమాదం చోటుచేసుకుంది. గుంతలో బొలెరో పడిపోయిన శబ్ధం విని చుట్టుపక్కల వారంతా అక్కడికి వచ్చారు. తర్వాత పోలీసులకు, అధికారులకు సమాచారం అందించగా, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ అర్థరాత్రి సమయంలో స్థానికుల సహాయంతో పోలీసులు బాధితులను రక్షించారు. మృతిచెందినవారిలో గోపాల్ (60), ఉదయ్ రామ్ చౌదరి (55), రామ్ చౌదరి (50), ధీరజ్ (45), తిలక్ చౌదరి (45), అనంత్ రామ్ చౌదరి (40), వినోద్ చౌదరి (38) మరణించారు. గాయపడిన వారిలో శాంతి చౌదరి, ఛోటూ చౌదరి ఉన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications