చనిపోయినట్లు నటించి రేపిస్టు నుంచి తప్పించుకుంది
న్యూఢిల్లీ: చనిపోయినట్లు నటించిన ఓ బాలిక ఓ కాముంధుడి నుంచి చాకచక్యంగా తప్పించుకుంది. అర్దరాత్రి 1,30 గంటల సమయంలో ఆరు బయట మంచం మీద పడుకుని ఉన్న చిన్నారి (8)ని ఓ కామాంధుడు ఎత్తుకుని వెళ్లాడు.
తరువాత బాలికకు మెలుకవ రావడంతో లేచి చూసింది. తాను ఇంటి దగ్గర కాకుండా వేరే ప్రాంతంలో ఉన్నానని గుర్తించి గట్టిగా కేకలు వెయ్యడానికి ప్రయత్నించింది. అయితే నిందితుడు బాలిక నోరు మూసేశాడు.

అతను చంపేస్తాడని భయపడిన బాలిక కదలకుండా చనిపోయినట్లు నటించింది. తరువాత అతను బాలికను గిల్లి చూశాడు. అయినా బాలిక చలించలేదు. అతను దూరంగా వెళ్లిన సమయంలో బాలిక అక్కడి నుంచి పరుగు తీసింది.
బాలికను పట్టుకోవడానికి ప్రయత్నించి అతను రాయి తగిలి కిందపడిపోయాడు. బాలిక బట్టల మీద రక్తపు మరకలు ఉన్నాయి. తనకు కడుపునొప్పిగా ఉందని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. కామాంధుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications