8 ఏళ్ల బాలిక కిడ్నాప్, అత్యాచారం, దారుణ హత్య, కిరాతకుడికి దేహశుద్ది, మేమే శిక్ష వేస్తాం!

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్ పశు వైద్యురాలు దిశ అత్యాచారం, హత్య కేసు మరువక ముందే 8 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన కర్ణాటకలోని కలబురిగిలో వెలుగు చూసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను ఆమెకు పరిచయం ఉన్న యల్లప్ప (25) అనే కామాంధుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు.

కలబురిగిలోని యాకాపుర గ్రామంలో యల్లప్ప అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 8 ఏళ్ల బాలిక సోమవారం మద్యాహ్నం పాఠశాలకు వెళ్లింది. పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. రాత్రి పొద్దుపోయినా బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు.

8 Year Old Girl was raped and murder near kalaburagi in Karnataka

అర్దరాత్రి సమయంలో గ్రామం శివార్లలో బాలిక శవమై కనిపించింది. బాలిక మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం సాయంత్రం బాలికకు చాక్లెట్లు తీసిస్తానని నమ్మించిన యల్లప్ప ఆమెను వెంట తీసుకెలుతున్న సమయంలో చూసిన గ్రామస్తులు ఆ విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పారు.

యల్లప్పను పట్టుకున్న బాలిక కుటుంబ సభ్యులు అతన్ని చెట్టుకు కట్టేసి చితకబాదేశారు. బాలిక అత్యాచారానికి, హత్యకు గురి కావడం, యల్లప్పను చితకబాదడంతో ఆ గ్రామంలో రెండు వర్గాల మద్య గొడవలు పెద్దవైనాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అదనపు బలగాలను గ్రామానికి తరలించాయి. యల్లప్పను తమకు అప్పగిస్తే మేమే శిక్ష విధిస్తామని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

యల్లప్పను అరెస్టు చేసి బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు సంఘటనా స్థలంలో మకాం వేశారు. ముందు జాగ్రత్త చర్యగా రెండు వర్గాల పెద్దలతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. యల్లప్పను తమకు అప్పగించాలని, మేమే శిక్ష విధిస్తామని బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+