షాకింగ్: 81 ల‌క్ష‌ల ఆధార్ కార్డులు ర‌ద్దు.. మ‌రి మీ కార్డు? చెక్ చేసుకోండిలా...

దేశ వ్యాప్తంగా సుమారు 81 లక్షల ఆధార్ కార్డులు రద్దయ్యాయి. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. మరి రద్దయిన ఆధార్ కార్డల్లో మీది ఉందా? లేదా?

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సుమారు 81 లక్షల ఆధార్ కార్డులు రద్దయ్యాయి. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. ఆధార్ రెగ్యులేషన్స్ 2016లోని సెక్షన్ 27, 28 సూచించిన వివిధ కారణాల వల్ల ఈ కార్డులు రద్దు చేసినట్లు యూఐడీఏఐ వెల్లడించింది.

మరి రద్దయిన ఆధార్ కార్డల్లో మీది ఉందా? లేదా? తెలుసుకోవాలనుకుంటే ఇలా చేయండి. యూఐడీఏఐ వెబ్ సైట్ లో ఉండే వెరిఫై ఆధార్ నంబర్ అనే ఆప్షన్ ద్వారా మీ కార్డు ఉందో, రద్దయిందో సులువుగా తెలుసుకోవచ్చు.

81 lakh Aadhaar numbers deactivated: See if yours is in the list or not, here's how

దీనికోసం ముందుగా మీరు మీ వెబ్ బ్రౌజర్ లో https://resident.uidai.gov.in/aadhaarverification అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. దీంతో మీరు నేరుగా వెరిఫై ఆధార్ నంబర్ ఆప్షన్ ఉన్న పేజీలోకి వెళతారు.

అక్కడ మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, దాంతోపాటు కింద ఉన్న గడిలో పక్కనే కనిపించే సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేసి, ఆపైన ఆకుపచ్చ రంగులో కనిపించే వెరిఫై బటన్ పై క్లిక్ చేయాలి.

మీ ఆధార్ నంబర్ యాక్టివ్ గా ఉంటే.. వెంటనే మీకొక మెసేజ్ కనిపిస్తుంది. అందులో మీ వయసు, రాష్ట్రం, మీ మొబైల్ నంబర్ లోని చివరి మూడు నంబర్లు చూపిస్తుంది. ఒకవేళ మీ ఆధార్ నంబర్ రద్దయి ఉంటే.. దానికి సంబంధించిన మెసేజ్ కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+