విషాదం: బస్సుపై తెగిపడ్డ హైటెన్షన్ వైర్లు, 9 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఈటా అనే పట్టణంలో ప్రయాణిస్తున్న బస్సుపై హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 18 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.

ఈ ప్రమాదంపై సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సుపై పడ్డ వైర్లను భారీ క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. హైటెన్షన్ వైర్లు కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications