టెక్కీలకు షాక్: 9 కంపెనీల్లో ఉద్యోగులకు కోత, ఖర్చులు తగ్గించుకొనేందుకేనా?

ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఐటి కంపెనీల్లో ఉద్యోగాల్లో కోత పడనుంది. ఈ మేరకు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు పింక్ స్లిప్పులను ఇచ్చేశాయి. దేశీయ కంపెనీలు నష్టాలను పూడ్చుకొనేందుకుగాను

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చోటుచేసుకొన్న పరిణామాలతో ఇప్పటికే ఐటి రంగం కుదేలైంది. అయితే ఇదే తరుణంలో కొత్త పెట్టుబడులు కూడ రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఐటి కంపెనీలు తమ సంస్థల ఖర్చులను గణనీయంగా తగ్గించుకొంటున్నాయి. ఈ మేరకు ఉద్యోగాల్లో కోతలు విధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.9 ప్రధానమైన టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల్లో కోతలను విధించనున్నారు.

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఐటి రంగం తీవ్రంగా ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది.ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకొనే పనిలో పడ్డాయి కంపెనీలు.

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకొన్న తర్వాత ఐటి కంపెనీల యజమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొత్త కొత్త నిబంధనలు టెక్ కంపెనీలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

అమెరికాలో చోటుచేసుకొన్న పరిణామాలన్నీ కూడ ఐటి కంపెనీలకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. ప్రత్యేకించి ఇండియాలోని కంపెనీలు కోలుకోలేని దెబ్బతింటున్నాయి.అయితే ప్రత్యామ్నాయాలను ఆయా కంపెనీలు వెతుకుతున్నాయి.

ఎయిర్ సెల్ లో ఉద్యోగాల కోత

ఎయిర్ సెల్ లో ఉద్యోగాల కోత

ఈ ఏడాది ఫిబ్రవరిలో సెల్యూలార్ సర్వీసెస్ మేజర్ ఎయిర్ సెల్ తన ఉద్యోగుల్లో 700 మందికి పింక్ స్లిప్ లు ఇచ్చింది. అంటే తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించింది. దేశీయ టెలికమ్యూనికేషన్ రంగంలో ఇదే తొలి ఉద్యోగాల కోత. దేశ వ్యాప్తంగా ఎయిర్ సెల్ లో దాదాపు 8 వేల మంది ఉద్యోగులున్నారు.ఈ ఏడాది సుమారు 700 మంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే ఇంకా మరికొందరికి ఈ పరిస్థితి వచ్చే ప్రమాదం లేకపోలేదు.

జీతాలను వదులుకొన్న స్నాప్ డీల్ వ్యవస్థాపకులు

జీతాలను వదులుకొన్న స్నాప్ డీల్ వ్యవస్థాపకులు

దేశీయ ఈ కామర్స్ దిగ్గజంగా పేరున్న స్నాప్ డీల్ కూడ ఉద్యోగాల్లో కోతకు సై అంటోంది. ఫ్లిప్ కార్డ్ ,అమెజాన్ వంటి సంస్థల నుండి వచ్చే పోటీని తట్టుకోలేక స్నాప్ డీల్ కూడ మెల్లమెల్లగా ఖర్చును తట్టుకొనేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.అయితే ఈ కంపెనీ నుండి సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని కంపెనీ వర్గాల నుండి ప్రచారం సాగుతోంది.అయితే ఉద్యోగులను తొలగించడమనేది ఖాయమనే ఆ సంస్థ వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నాయి.ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించిన కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బహల్ , రోహిత్ బన్సాల్ కూడ తమ జీతాలను వదులుకొంటున్నట్టు ప్రకటించారు. సంక్షోభంలో పడిపోయిన స్నాప్ డీల్ ను మళ్ళీ పూర్వపు స్థితికి తెచ్చేందుకుగాను కంపెనీ సర్వశక్తులను ఒడ్డుతోంది.

యప్ మీ లో క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగాల్లోకోత

యప్ మీ లో క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగాల్లోకోత

యప్ మీ సంస్థ లో ఫ్యాషన్ రీటైలర్ , క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ ,వేర్ హౌజింగ్ లో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు తెలిపింది. జనవరి నెలలో గరిష్ట స్థాయిలకు వెళ్ళాలని ప్లాన్ చేశామని కానీ పెద్ద నట్ల రద్దు తర్వాత భారీగా దెబ్బతిన్నట్టు యప్ మీ ప్రకటించింది.యప్ మీ వ్యవస్థాపకుడు వివేక్ గౌర్ చెప్పారు. అమ్మకాలు పడిపోయాయనన్నారు. ప్రస్తుతం భారత్ వెలుపల వ్యాపారాలపై ఫోకస్ చేయాలని నిర్ణయించామన్నారు.దీంతో దేశీయంగా ఉద్యోగుల సంఖ్యను కంపెనీ తగ్గిస్తోంది.

క్రాఫ్ట్స్ విల్లాలో ఉద్యోగుల పై వేటు

క్రాఫ్ట్స్ విల్లాలో ఉద్యోగుల పై వేటు

సంప్రదాయ వస్త్రాలను మార్కెటింగ్ చేస్తున్న క్రాఫ్ట్ విల్లా వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. టెక్నాలజీ టీమ్స్ , ఆపరేషన్స్ , మార్కెటింగ్ టీమ్స్ లో పనిచేసే ఉద్యోగులను తొలగించనున్నట్టు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.

పేయూ లో పింక్ స్లిప్ లు

పేయూ లో పింక్ స్లిప్ లు

పేమేంట్ గేట్ వే పేయూ ఇండియా ఏకంగా తన కొత్త క్రెడిట్ కార్డు ప్రొడక్ట్ లాంచ్ ప్లానింగ్ నే వదులుకొంది. 85 మంది కాల్ సెంటర్ టీమ్ కు, 25 మంది కలెక్షన్ టీమ్ కు కంపెనీ పింక్ స్పిప్పులను అందజేసింది. వీరంతా తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

టోలెక్సో లో నోటీసులు

టోలెక్సో లో నోటీసులు

ఇండస్ట్రీయల్ మార్కెట్ ప్లే టోలెక్సో లో 50 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్లులు అందజేసింది కంపెనీ. ఈ మేరకు వారంతా ఉద్యోగాలను వదులుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పలు కారణాలను చూపుతూ వారిని ఉద్యోగాల నుండి తొలగించాలని నిర్ణయం తీసుకొన్నారు.

గిర్నార్ సాఫ్ట్ వేర్ వంద ఉద్యోగాలకు కోత

గిర్నార్ సాఫ్ట్ వేర్ వంద ఉద్యోగాలకు కోత

గిర్నార్ సాఫ్ట్ వేర్ కంపెనీ కూడ సుమారు 100 ఉద్యోగాలను కోత పెట్టే అవకాశం ఉంది.వ్యాపారాల పునరుద్దరణ బాట పట్టించుకోవడం కోసం కంపెనీ ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది. వచ్చే క్వార్టర్ లో లాభాలను ఆర్జించే కంపెనీగా నమోదు చేసే లక్ష్యంతో ఉద్యోగాలకు కోత పెట్టామని కంపెనీ చెబుతోంది.

స్టేజిల్లా లో కూడ కోత

స్టేజిల్లా లో కూడ కోత

చెన్నైకు చెందిన స్టేజిల్లా తన వ్యాపారాలను పూర్తిగా మూసివేసింది. కొత్త ఫండ్స్ ను సేకరించడానికి ఇబ్బందిగా మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ కంపెనీ మూసివేయడం మంచిదని భావించింది.అయితే ఈ కంపెనీ ఉద్యోగులు మొత్తం రోడ్డున పడే అవకాశం ఉంది.

లీఎకో లో కూడ ఇదే పరిస్థితి.

లీఎకో లో కూడ ఇదే పరిస్థితి.

చైనీస్ బిలీయనీర్ కంపెనీ జియా యుఎటింగ్ కంపెనీ లీఎకో కూడ 85 శాతం ఇండియాకు చెందిన ఉద్యోగులకు తొలగించింది. అంతే గాక ఇద్దరు అధికారులు కూడ కంపెనీ నుండి వైదొలిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+