నిర్దాక్షిణ్యంగా... అత్తను చంపిన 9 ఏళ్ల బాలుడు... కుటుంబ పరువు తీసిందని...
10 ఏళ్ల క్రితం ఆ మహిళ తాను ఇష్టపడ్డ ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులు,బంధువులను ఎదిరించి అతన్ని వివాహమాడింది. కాలం అలా గడిచిపోతూ ఉంటే... కొన్నేళ్లకు తన కుటుంబం,బంధువులు మనసు మార్చుకున్నారు. ఆమెను మళ్లీ చేరదీశారు. దీంతో ఇరువురి మధ్య మళ్లీ సత్సంబంధాలు మొదలయ్యాయి. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ కుటుంబం చూపించిన ప్రేమ,ఆప్యాయత వట్టిదేనని తేలిపోయింది. ఇంతకీ ఏం జరిగింది....

ఎవరా మహిళ...
పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని సర్గోదా గ్రామానికి చెందిన ఓ మహిళ(30) 10 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు,బంధువులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి అతన్ని వివాహమాడింది. ఆమెకు ముగ్గురు పిల్లలు. మొదట్లో ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆమె కుటుంబం,బంధువులు కొన్నేళ్లకు మనసు మార్చుకున్నారు. మళ్లీ ఆమెను చేరదీయడంతో ఇరువురి మధ్య రాకపోకలు మొదలయ్యాయి.

కాల్చి చంపిన 9ఏళ్ల మేనల్లుడు...
ఇదే క్రమంలో మంగళవారం(సెప్టెంబర్ 22) ఆ మహిళ తన మేనమామ ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరైంది. ఫంక్షన్ జరుగుతున్న సమయంలో 9 ఏళ్ల ఆమె మేనల్లుడు గన్‌తో ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ వెంటనే బాలుడి కుటుంబం అక్కడి నుంచి పరారైంది. కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని అత్త తమ పరువు తీసిందన్న ఉద్దేశంతోనే ఆ బాలుడు ఆమెపై కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు.
Recommended Video

కుటుంబమే అతన్ని పురిగొల్పింది...
నిజానికి ఆ బాలుడికి గన్ ఎలా వాడాలో అతని కుటుంబమే శిక్షణ ఇచ్చిందని.. అత్తపై కాల్పులు జరపాలని కూడా వారే చెప్పారని పోలీసులు తెలిపారు. బాలుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా,పాకిస్తాన్‌లో ఇలాంటి పరువులు హత్యలు చాలా సహజం. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం... ప్రతీ ఏటా దాదాపు వెయ్యి మంది మహిళలు పాకిస్తాన్‌లో పరువు హత్యలకు గురవుతున్నారు.
-
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా..! -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..!












Click it and Unblock the Notifications