రేప్ యత్నం: కొరికేసి తప్పించుకున్న బాలిక

ముంబై: అత్యాచారానికి ప్రయత్నించిన ఓ దుర్మార్గుడి బారి నుంచి సమయస్ఫూర్తి, ధైర్యంతో తప్పించుకుంది 9ఏళ్ల బాలిక. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తాము బయటికి వెళ్లి తిరిగి వచ్చేంత వరకు పొరుగింట్లో ఉండే.. వ్యక్తి వద్ద ఉండాలని తమ కూతురు(9)కి సూచించారు ఆమె తల్లిదండ్రులు. దీంతో ఆమె అంగీకరించి అక్కడే ఉండిపోయింది.

అయితే, తల్లిదండ్రులు వెళ్లిపోయిన కొద్ది సేపటికే బాలికను లైంగిక వేధించడం ప్రారంభించాడు నిందితుడు. ఆమె ప్రైవేటు భాగాలను తాకుతూ లైంగిక దాడికి ప్రయత్నించాడు.

9-year-old brave girl saves herself from neighbour trying to abuse her sexually

ఆమె దుస్తులను విప్పేసి అత్యాచారానికి యత్నించాడు. ధైర్యం చేసిన బాలిక తనను రక్షించుకునేందుకు నిందితుడి చేయిని కొరికింది. ఆ తర్వాత అతని మెడను కొరికి, అతడ్ని తన్నేసి అక్కడ్నుంచి పారిపోయింది.

జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+