వైరల్ వీడియో: ఛీ.. ఛీ.. 92 ఏళ్ల వృద్ధుడిపై మహిళా డాక్టర్..

తల్లిదండ్రుల తర్వాత చేతులెత్తి మొక్కేది వైద్యుడికి మాత్రమే. అందుకే వైద్యో నారాయణో హరి అంటారు పెద్దలు. అంతేకాక వైద్యుడి దగ్గర ఏ విషయం దాచుకోకుండా చెప్పాలంటారు. ఎంత పెద్ద శస్త్ర చికిత్స అయినా ఎలాంటి బెణుకు లేకుండా వైద్యులు చాలా కూల్ గా చేస్తారు. ఎలాంటి ఒత్తిడి అయినా డాక్టర్లు తీసుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో యువ డాక్టర్లు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. డాక్టర్లే రోగులపై దాడికి పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఓ మహిళా డాక్టర్ 92 ఏళ్ల వృద్ధుడిపై దాడికి పాల్పడిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వైద్యురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు.

సమాజంలో వైద్యులకు అధిక గౌరవం ఉంటుంది. ప్రాణాలను నిలబెట్టే డాక్టర్లు అంటే ఎవరికైనా గౌరవం, మర్యాద ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో కొందరు వైద్యులు.. ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఏకంగా రోగులపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా రాజస్థాన్ అజ్మీర్ లోని జేఎల్ఎన్ హాస్పిటల్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువ వైద్యురాలు.. 92 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసింది. ఆ వృద్ధుడి చెంప చెల్లుమనిపించింది. కారణం ఏంటంటే.. ఆ వృద్ధుడు ఆమెను చూసుకోకుండా తాకడమే.

ఇంత చిన్న తప్పుకు ఆ యువ వైద్యురాలు కోపంతో రగిలిపోయింది. ఓ వైపు వృద్ధుడు క్షమాపణలు చెప్పినా వినిపించుకోకుండా అందరూ చూస్తుండగానే అతడిపై దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు హాస్పిటల్ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ వైద్యురాలిపై నెటిజెన్లు మండిపడుతున్నారు. 92 ఏళ్ల వృద్ధుడు కళ్లు కనిపించక చేసిన పనికి అంతలా కొట్టడం ఏంటని ఫైర్ అవుతున్నారు. వైద్యులకు ఇంత కోపం ఉంటే విధులు ఎలా చేస్తారంటూ కామెంట్స్ పెడుతున్నారు. రోగులను చూసుకోవాల్సిన డాక్టర్లే వారిపై ఇలా ఇష్టం వచ్చినట్లు దాడికి పాల్పడితే ఎలా అంటూ మండిపడుతున్నారు.

92-Year-Old s Nightmare Female Doctor s Fury Unleashed in Viral Slap Assault at Ajmer s JLN Hospital

మరోవైపు కొందరు నెటిజెన్లు వైద్యురాలిని సపోర్ట్ చేస్తున్నారు. వృద్ధుడు.. డాక్టర్ చెస్ట్ ను తాకాడని .. తెలియక చేసినా.. తెలిసి చేసినా సదరు మహిళ ఇలాగే రియాక్ట్ అవుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి వేధింపులు తట్టుకోలేని డాక్టర్ చేయి లేపడంలో తప్పు లేదని చెబుతున్నారు. అయితే ఈ ఘటన సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ గా మారి ఆ రాష్ట్ర సీఎం దృష్టికి కూడా వెళ్లింది. ఈ ఘటనపై సీఎం కార్యాలయం వివరణ కోరగా.. ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. వృద్ధుడిపై మహిళా డాక్టర్ చేయి చేసుకోవడం కరెక్ట్ కాదని.. ఈ ఘటనపై కమిటీ వేశామని.. ఆ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏదేమైనా వైద్యులు ఇలా క్షణికావేశానికి లోను కావడం వారి భవితవ్యంపై ప్రశ్నార్థకంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. భవిష్యత్తులో అనేక సర్జరీలు చేయాల్సిన డాక్టర్లు.. ఇలా చిన్నచిన్న వాటికి ఒత్తిడికి లోను కావడంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+