Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Uber Auto Ride: 10 కి.మీ ఉబెర్ ఆటో రైడ్ కు రూ. 1,03,11,055 బిల్లు..

ఓ వ్యక్తి బయటకు వెళ్లేందుకు ఉబెర్ ఆటో బుక్ చేశాడు. ఆటో బుక్ చేసేటప్పుడు రూ.207 చూపించింది. దీంతో అతను ఆటో బుక్ చేశాడు. ఆటో వచ్చింది. అతను ఆటోలో ఎక్కి ఓటీపీ చెప్పాడు. అతను వెళ్లాల్సిన చోటికి వెళ్లాడు. అప్పుడు బిల్ పే చేద్దామని మొబైల్ చూశాడు. అందులో చూపించిన అమౌంట్ చూసి షాకయ్యాడు. అతనే కాదు ఆటో డ్రైవర్ కూడా షాకయ్యాడు. పే చేయాల్సిన బిల్లు ఏకంగా కోటి రూపాయల పైనే చూపించింది.

ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్‌కు చెందిన శ్రీరాజ్ నీలేష్ అనే వ్లాగర్ బెంగుళూరులో ఉబెర్ ఆటోలో ప్రయాణించిన తర్వాత కోటి రూపాయలకు పైగా బిల్లు వచ్చింది. గమ్యస్థానానికి చేరుకున్న నీలేష్ నగరంలో 10 కి.మీ రైడ్‌కు కోటి రూపాయల బిల్ వచ్చినట్లు చెప్పాడు. ఉబెర్ కస్టమర్ కేర్ సంప్రదించినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పాడు.

A 10 km Uber Auto ride in Bangalore costs Rs 1 03 11 055 bill received

ఇందుకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. "మేము UberApp ద్వారా కొద్ది దూరం వరకు ఆటో బుక్ చేశాను. మొదట్లో రూ. 207 కోట్ చేసి, మా గమ్యస్థానానికి చేరుకోగానే రూ. 1,03,11,055 బిల్లు రావడంతో ఆశ్చర్యపోయాం" అని నీలేష్ వీడియోలో వివరించాడు. అయితే ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు.నోయిడాకు చెందిన మరో ఉబర్ కస్టమర్ రూ. 7 కోట్ల బిల్లును అందుకున్నట్లు పేర్కొన్నారు.

దీపక్ టెంగూరియా అనే వ్యక్తి, ఉబెర్ ఆటో రైడ్‌కు ప్రాథమిక ధర రూ. 62 అని చూపించింది. అయితే రైడ్ ముగిసిన తర్వాత అతనికి రూ.7,66,83,762 బిల్ చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను అతని స్నేహితుడు ఆశిష్ మిశ్రా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పంచుకున్నారు. దీంతో ఉబెర్ ఇండియా కస్టమర్ సపోర్ట్ క్షమాపణ చెప్పింది. పరిస్థితిని సరిదిద్దడానికి ఈ విషయాన్ని చురుకుగా పరిశీలిస్తున్నట్లు కంపెనీ వినియోగదారులకు హామీ ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+