తండ్రి టెక్కీ, తల్లి టీచర్, కూతురు ఏం చేసిందంటే, 12వ అంతస్తులోని బాల్కనీలో !
బెంగళూరు: తండ్రి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తల్లి ప్రైవేట్ పాఠశాలలో టీచర్. తల్లిదండ్రులు బాగా చదువుకున్న కుటుంబంలో పుట్టిన కూతురు గత మూడు నెలలుగా స్కూల్ కు వెళ్లలేదు. ఉదయం తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లగా పాఠశాలకు వెళ్లేందుకు బయటకు వెళ్లిన అమ్మాయి తరువాత ఇంటికి చేరుకుని అపార్ట్ మెంట్ లోని 12వ అంతస్తులోని బాల్కనీలోకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేసింది.
మృతురాలిని జెస్సికా(15)గా గుర్తించామని పొలీసులు అన్నారు. బెంగళూరు నగరంలోని బెళ్లందూరులోని క్లాసిక్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు అన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఒక క్లాసిక్ అపార్ట్మెంట్లో నివసించింది. అపార్ట్‌మెంట్‌లోని 11వ అంతస్తులో జెస్సికా కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు.

జెస్సికా ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. జెస్పికా కుటుంబ సభ్యులు తమిళనాడుకు చెందినవారు. జెస్సికా తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా, ఆమె తల్లి ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. జెస్సికా 10వ తరగతి చదువుతున్నప్పటికీ గత రెండు నెలలుగా సరిగా స్కూల్ కు వెళ్లడం లేదని తెలిసింది. మూడు నెలల్లో కేవలం 6 రోజులు మాత్రమే జెస్సికా స్కూల్ కు వెళ్లి తరగతులకు హాజరు అయ్యిందని వెలుగు చూసింది.
సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. తాను నివాసం ఉంటున్న 11వ ఫ్లోర్‌పైకి వెళ్లి అక్కడి నుంచి జెస్సికా కిందకు దూకేసిందని పోలీసులు అంటున్నారు. తీవ్ర రక్తస్రావమై శరీరం ఛిద్రం కావడంతో జెస్సికా అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు అంటున్నారు. బెళ్లందూరు పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి పరిశీలించారు.
ఈ విషయమై వైట్‌ఫీల్డ్ డీసీపీ గిరీష్ మీడియాతో మాట్లాడుతూ క్లాసిక్ అపార్ట్‌మెంట్‌లో ఉదయం ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు.

జెస్సికా అనే 15 ఏళ్ల బాలిక 12వ అంతస్తు నుంచి పడి మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తండ్రి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తల్లి ప్రైవేట్ స్కూల్‌లో టీచర్. ఈ ఉదయం బాలిక పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చింది. అప్పుడు టీచర్ తల్లికి ఫోన్ చేసి మీ కూతురు స్కూల్ కి రాలేదని చెప్పిందని విచారణలో వెలుగు చూసిందని పోలీసు అధికారులు తెలిపారు.
అనంతరం తల్లిదండ్రులు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఇంట్లో తల్లిదండ్రులు పనికి వెళ్లారు, ఎవరు లేరు. పాఠశాలకు వెళ్లిన జెస్సికా తరగతికి హాజరుకాకుండా ఆమె నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు తిరిగివస్తున్నది పోలీసులు అంటున్నారు. జెస్సికా ఆత్మహత్యకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, బెళ్లందూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని వైట్‌ఫీల్డ్ డీసీపీ గిరీష్ తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications