బాలికను రేప్ చేసిన పక్కింటి కుర్రాడు
లక్నో: ఒంటరిగా వెళుతున్న బాలిక మీద ఓ కుర్రాడు అత్యాచారం చేసిన దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బదోహి జిల్లాలో జరిగింది. బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించామని పోలీసు అధికారులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బదోహి జిల్లాలోని సర్వార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. ఈ బాలిక ఇంటి సమీపంలో ఓ కుర్రాడు నివాసం ఉంటున్నాడు.

గురువారం సాయంత్రం బాలిక పని మీద బయటకు వెళ్లింది. తరువాత ఇంటికి వెళుతున్న సమయంలో ఆ కుర్రాడు బాలికకు మాయమాటలు చెప్పి సమీపంలోని నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లాడు. తరువాత బాలిక మీద అత్యాచారం చేశాడు.
విషయం బయటకు చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఇంటికి వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కుర్రాడు పరారైనాడని అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications