Girl: లోదుస్తుల్లో కోటి బంగారం, 19 ఏళ్లకే కన్నింగ్ యువతి స్కెచ్, దబాయించి క్లైమాక్స్ లో ?!
కొచ్చి/తిరువనంతపురం: కేరళలోని కాసరగూడ్ చెందిన 19 ఏళ్ల యువతి అక్రమ బంగారం స్మగ్లింగ్ చేస్తోందని ఆరోపిస్తూ ఆమెను అరెస్టు చేశారు. ఆదివారం రాత్రి కేరళలోని కోజీకోడ్ విమానాశ్రయంలో దుబాయ్ వచ్చిన యువతిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు కోటి రుపాయల విలువ చేసే 1 కిలో 884 గ్రాముల విలువైన బంగారాన్ని యువతి దుబాయ్ నుంచి కేరళకు తరలిస్తున్నట్లు తెలిసింది.
కస్టమ్స్ క్లియరెన్స్ అనంతరం విమానాశ్రయం నుంచిఆమె బయటకు వస్తుండగా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 19 ఏళ్ల యువతి తన లోదుస్తుల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. నిందితురాలిని కాసర్‌గూడ్ కు చెందిన షహలాగా పోలీసులు గుర్తించారు, ఆమె తనపై వచ్చిన ఆరోపణలను మొదట ఖండించింది.

అనంతరం పరీక్షల అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఓ ముఠాలో బంగారం స్మగ్లర్ గా అనుమానిస్తున్న పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. కాసర్ గూడ్ చెందిన షహలా తన లోదుస్తులలో మూడు ప్యాకెట్లలో సుమారు కోటి రూపాయల విలువైన బంగారు నగలు దాచిపెట్టిందని పోలీసులు చెప్పారు.
రాత్రి 10.30 గంటలకు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో షహలా దుబాయ్ నుంచి కేరళలోని కోజీకోడ్ విమానాశ్రయానికి వచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా కస్టమ్స్ క్లియరెన్స్ తర్వాత షహలాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని మలప్పురం జిల్లాలోని ఈ విమానాశ్రయంలో అక్రమ బంగారం స్మగ్లింగ్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్మగ్లింగ్ వ్యాపారంపై జిల్లా పోలీసులు నిఘా పెట్టారు. విదేశాల నుంచి వస్తున్న అందరి మీద కేరళ పోలీసులు నిఘా వేశారు.
ఇందుకు సంబంధించి ప్రత్యేక స్క్వాడ్‌ను కూడా కేరళ పోలీసులు ఏర్పాటు చేశారు. విమానాశ్రయం ద్వారా బంగారం స్మగ్లింగ్ చేసేందుకు ఈ ప్రత్యేక దళానికి చెందిన పోలీసులు ఇప్పటి వరకు 85 కేసులు నమోదు చేశారు. అలాగే కొందరు కస్టమ్స్ అధికారులు కూడా స్మగ్లింగ్ వ్యాపారంలో పాలుపంచుకుంటున్నారని, వారికి సహాయం చేస్తున్నారని కేరళ పోలీసులు ఆరోపిస్తున్నారు. షహలాకు ఏ బంగారు స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలు ఉన్నాయి ? అని అధికారులు ఆరా తీస్తున్నారు. స్మగ్లింగ్ ముఠాల మధ్య తరచూ తగాదాలు, జరగడంతో ఒకరి మీద ఒకరు లీక్ లు ఇస్తున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications