ఉత్తరకాశీలో అర్ధరాత్రి కంపించిన భూమి - భయంతో పరుగులు..!!

ఉత్తరాఖండలోని ఉత్తరకాశీలో మరోసారి భూకంపం వచ్చింది. అర్ద్రరాత్రి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

ఉత్తరాఖండలోని ఉత్తరకాశీలో మరోసారి భూకంపం వచ్చింది. అర్ద్రరాత్రి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వరుస భూకంపాలతో ప్రజలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. 20 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడుసార్లు భూమి కంపించింది. మొదట శనివారం అర్ధరాత్రి 12.40 గంటలకు భూకంపం వచ్చింది. ఐదు నిమిషాల వ్యవధిలోనే 12.45 గంటలకు మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

అనంతరం 1.01 గంటలకు మూడోసారి భూ ప్రకంపణలు రావటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 2.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని విశ్లేషించింది. తాజాగా చోటు చేసుకున్న భూ ప్రకంపణాలతో ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టం చేసారు. అయితే, ఈ నెలలో భూ ప్రకంపణలు చోటు చేసుకోవటం ఇది రెండో సారి. ఈ నెల 2వ తేదీన ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ జిల్లాలో భూమి కంపించింది. మూడు నెలల క్రితం గత డిసెంబర్ లోనూ ఉత్తర కాశీలో భూకంపం సంభవించింది.

A 2.5 magnitude earthquake hits Uttarakhands Uttarkashi on saturday midnight

అదే విధంగా నేపాల్ లో వరుసగా రెండు సార్లు భూ ప్రకంపణలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 1.23 గంటలకు జిల్లాలోని అధికారి చౌరు ప్రాంతంలో భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదయిందని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మానిటరింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. మరో 40 నిమిషాల వ్యవధిలో జిల్లాలోని మరో ప్రాంతం భూమి కంపించిందని తెలిపింది. ఉత్తరాఖండ్ తో పాటుగా పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న వరుస భూ ప్రంకపణలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. వీటి కారణంగా ఎటువంటి నష్టం వాటిల్ల లేదని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+