యువతి మీద ఆరు మంది గ్యాంగ్ రేప్, బెంగళూరులో, దాడి, వీడియో, 36 గంటలు !
బెంగళూరు: కుటుంబ సభ్యులు అందరూ దూరం కావడంతో హోటల్ లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా నివాసం ఉంటున్న యువతి (26) మీద ఆరు మంది కామాంధులు అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితో గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పెడుతామని కామాంధులు బెదిరించారు.
బెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్ ప్రాంతంలో నవంబర్ 23వ తేదీ జరిగిన ఈదారుణ ఘటన డిసెంబర్ 15వ తేదీ వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాలు తెలుసుకున్న పలువురు చలించిపోయారు.

బెంగళూరు వచ్చిన యువతి
భూకంపంలో కుటుంబ సభ్యులు అందరూ దూరం కావడంతో 26 ఏళ్ల యువతి ఉద్యోగం కోసం బెంగళూరు చేరుకుని ఓ హోటల్ క్లీనింగ్ పని చేస్తూ నగర శివార్లలోని చిన్న గదిలో నివాసం ఉంటున్నది. నవంబర్ 23వ తేదీన ఆనేకల్ సమీపంలోని నిర్జనప్రదేశంలో యువతి ఒంటరిగా వెళ్లింది.

పాత ఇంటిలో !
ఆరు మంది కామాంధులు ఒంటరిగా వెలుతున్న యువతి కాళ్ల మీద రాళ్లతో దాడి చేశారు. కిందపడిపోయిన యువతిని ఎత్తుకుని నిర్జనప్రదేశంలోని పాడుబడిన ఇంటిలోకి తీసుకెళ్లారు. కాళ్లకు తీవ్రగాయం కావడంతో తాను కిందపడి ఎడ్చుతున్న సమయంలో ఓ వ్యక్తి తన మీద అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది.

వీడియో తీసి గ్యాంగ్ రేప్
ఒక వ్యక్తి అత్యాచారం చేసే సమయంలో మొబైల్ లో వీడియో తీసిన తరువాత తనను బెదిరించి ఆరు మంది మరుసటి రోజు వరకూ అత్యాచారం చేశారని, నగ్నంగా నన్ను వదిలేసి తన బట్టలు ఎత్తుకుని వెళ్లిపోయారని యువతి విలపించింది. కాలికి తీవ్రగాయాలు కావడం వరుసగా అత్యాచారం చెయ్యడంతో అక్కడి నుంచి కదలలేకపోయానని యువతి చెప్పింది.

నగ్నంగా వచ్చి చెత్తకుప్పలో !
అత్యాచారం జరిగిన తరువాత 36 గంటల పాటు ఆ ప్రాంతానికి ఎవ్వరూ రాకపోవడంతో తాను ఒంటరిగా ఉండిపోయానని యువతి విలపించింది. తరువాత నగ్నంగా సమీపంలోని చెత్తకుప్ప దగ్గరకు వెళ్లి చిరిగిపోయిన ఓ షర్టు ఎత్తుకుని వేసుకున్నానని యువతి వివరించింది.

స్థానికుల సహాయంతో !
చిన్నగా నడుచుకుంటూ అటు వైపు వెలుతున్న వారి సహాయంతో ఆసుపత్రికి చేరుకున్నానని యువతి విలపించింది. శుక్రవారం విషయం తెలుసుకున్న పోలీసులు యువతి చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్యాంగ్ రేప్ చేసి వీడియో తీసిన కామాంధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications