నాలుగేళ్ల బాలికపై అత్యాచారం
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని ఇంటికి తీసుకు వెళ్లిన ఓ కామంధుడు అత్యాచారం చేశాడు. సున్నితమైన భాగాలలో తీవ్రగాయాలు కావడంతో బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది.
బెంగళూరు నగర శివార్లలోని తావరకెరె ప్రాంతంలో నివాసం ఉంటున్న పుట్టరాజ (45) అనే కామాంధుడిని అరెస్టు చేశామని తావరకెరె పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరుకు పుట్టరాజ కూలి పని చేస్తున్నాడు.
ఇతని ఇంటి పక్కనే ఓ మహిళ నివాసం ఉంటున్నది. భర్త చనిపోవడంతో నాలుగు సంవత్సరాల కుమార్తెతో కలిసి ఉంటూ కూలి పని చేస్తూ ఆమె కాలం గడుపుతున్నది. బుధవారం రాత్రి ఆమె ఇంటి పని చేసుకుంటున్నది.

బాలిక ఇంటి ముందు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నది. ఆ సమయంలో పుట్టరాజ బాలికను తన ఇంటికి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఇంటికి వెళ్లి సున్నితమైన ప్రాంతాలలో నొప్పిగా ఉందని తల్లికి చెప్పింది.
ఆమె వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లడంతో బాలిక మీద అత్యాచారం జరిగిన విషయం వెలుగు చూసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తప్పించుకు తిరుగుతున్న పుట్టరాజను శుక్రవారం అరెస్టు చేశారు. బాలికకు, పుట్టరాజకు వైద్య పరిక్షలు నిర్వహించామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications