బాలుడితో బలవంతంగా మద్యం తాగించారు (వీడియో)
తిరువన్నామలై: అణ్యం పుణ్యం తెలియని బాలుడికి బుద్ధి చెప్పాల్సిన బంధువులు దారుణానానికి పాల్పడ్డారు. బంధువులు మద్యం సేవిస్తున్న సమయంలో బాలుడిని పక్కన కుర్చోపెట్టుకుని అతనికి మందు ఎలా తాగాలి, తరువాత ఊరగాయ ఎలా తినాలి అని నేర్పించారు.
తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా ఎస్పీ ఆర్. పోన్ని తెలిపిన వివరాల ప్రకారం నగరం సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ గ్రామంలో నివాసం ఉంటున్న ముగ్గురు బంధువులు ఆరుబయట కూర్చుని మద్యం సేవిస్తున్నారు.
అదే సమయంలో అటు వైపు వెళుతున్న నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి కాని బాలుడిని పిలిచి పక్కన కుర్చో పెట్టుకున్నారు. తరువాత గ్లాస్ లో మందు పోసి నీళ్లు కలిపారు. బాలుడి ముందు పెట్టి తాగురా.... తాగురా అంటు బలవంతం చేశారు. ఆ బాలుడు మొదట గ్లాస్ లో ఉన్న మద్యం వాసన చూశాడు.

చివరికి గ్లాస్ ఎత్తుకుని కిందకు దించకుండా మందు తాగేశాడు. తరువాత అక్కడే ఉన్న ఊరగాయ ముక్కలు తీసుకుని తినాలని వారు చెప్పారు. బాలుడు ఊరగాయ ఎత్తుకుని తిన్నాడు. ఈ వీడియో క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. విషయం తెలుసుకున్న పోలీసు అధికారి ఎం. గణేషన్ బాలుడి దగ్గర మందు తాగించిన ముగ్గురిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications