పరుగెడుతున్నా... పట్టుకుని వచ్చి రేప్ చేశారు..!

ఇరుగు పోరుగున ఉన్నవారు మనకు తోడుగా ఉంటారని సాధరణంగా పలు కుటుంభాలు భావిస్తాయి. ఏదైన కష్టకాలం వస్తే వారితో చెప్పుకుంటారు. బయట ఏదైన అత్యవసరం పడితే పక్కింటి వారికి చెప్పి మరి బయటకు వెళతారు. కాని ప్రస్థుతం సమాజంలో పక్కింటి పార్వతమ్మలు, పార్వతయ్యలే శత్రువులుగా మారుతున్నారు. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఒంటరిగా ఉన్న 55 ఏళ్ల మహిళపైన పక్కింటికి చెందిన యువకులు అత్యాచారం చేసి ,అనంతరం ఎవరికి చెప్పందంటూ కర్రలతో విపరీతంగా కొట్టారు.

మధ్యప్రదేశ్‌‌లోని బింద్‌లో లో నివామంటున్న ఓ మధ్యవయస్కురాలిపై పక్కింటికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన ఆగస్టు 31న జరిగింది. మహిళ భర్త తన కూతురును చూసేందుకు వెళ్లాడు. దీంతో మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. దీంతో పక్కనే నివాసం ఉంటున్న బ్రిజెందర్ మరియు సూరజ్ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఒంటరిగా ఉంటున్న మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం ఆమేపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. అయితే యువకుల భారి నుండి ఆమే తప్పించుకుని బయటకు వచ్చింది. కాని వారు వెంటపడి తిరిగి ఇంట్లోకి లాక్కెళ్లారు. అనంతరం అత్యాచారం చేశారు.

A 55-year-old woman was allegedly gangraped by two of her neighbours

ఈ నేపథ్యంలోనే ఆమేను కర్రలతో చితకబాదారు. జరిగిన సంఘటన పై బయట నోరు విప్పిన పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపివేస్తామని బెదిరించారు. అయితే సెప్టెంబర్ 2న కూతరు ఇంటికి వెళ్లిన భర్త తిరిగి రావడంతో ఆమే జరిగిన విషయం భర్తకు చెప్పింది. దీంతో ఇద్దరు బార్యభర్తలు వెళ్లి స్థానిక పోలీసు స్టేషన్‌లో పిర్యాధు చేశారు.కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విచారించేందుకు వాళ్ల ఇంటికి వెళ్లారు. అప్పటికే విషయం తెలుసుకున్న యువకులు ఇంటినుండి పారిపోయారు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులు మామా అళ్లుల్లు కావడం విశేషం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+