ఫైండింగ్ ఫోని: తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలోనే కన్నుతెరిచిన పసిగుడ్డు
భువనేశ్వర్ః ఒకవంక చండ ప్రచండ ఫోని తుఫాన్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోన్న సమయంలోనే ఓ పసిగుడ్డు కన్ను తెరిచింది. ప్రకృతి విలయానికి సాక్షిగా నిలిచింది. శుక్రవారం ఉదయం ఫోని తుఫాన్ ఒడిశాలోని పూరీ తీరాన్ని తాకిన అదే క్షణాన జన్మించిందా పసిపాప. ఆ పాపకు ఫోని నామకరణం చేశారు తల్లిదండ్రులు. అత్యంత అరుదైన ఈ ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో చోటు చేసుకుంది.

నాలుగు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన ఫోని తుఫాన్ ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒడిశాలోని పూరీ వద్ద తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో భువనేశ్వర్‌లోని మంచేశ్వర్ ప్రాంతంలో రైల్వే ఆసుపత్రిలో ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలోనే జన్మించినందున ఆ పసిగుడ్డుకు ఫోని అని నామకరణం చేశారు. ఆ బిడ్డ తల్లి ఓ రైల్వే ఉద్యోగిని. మంచేశ్వర్‌లోని రైల్వే వర్క్‌షాప్, కోచ్ రిపేర్ వర్క్‌షాప్‌లో పనిచేస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications