Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలీవుడ్ సినిమా స్టోరీ, ముస్లీం అమ్మాయి, భజరంగ్ దళ్ లీడర్ లవ్ స్టోరీ, గ్రేట్ ఎస్కేప్ తో క్లైమాక్స్ !

దేశంలో కొన్ని ప్రాంతాల్లో హిందూ, ముస్లీంల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ప్రాంతాలు చాలానే ఉన్నాయి హిందూ, ముస్లీంలు కలసిమెలసి అన్నదమ్ముల్లా ఉండే ప్రాంతాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. హిందూ, ముస్లీంల పండుగలు రెండు మతాల వాళ్లు కలసిమెలసి ఒకే కుటుంబంలా పండుగలు జరుపుకునే గ్రామాలు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఇంకా ఉన్నాయని మనం అప్పుడప్పుడు చూస్తుంటాము.

కర్ణాటకలోని దక్షిణ కన్నడ, మంగళూరుతో పాటు పరిసర ప్రాంతాలు మతపరంగా చాలా సున్నితమైన ప్రాంతాలు. హిందూ-ముస్లింల గొడవలు ఇక్కడ సర్వసాధారణం అయిపోయాయి. లవ్ జిహాద్, నైతిక పోలీస్ గిరి కేసులు తరచుగా నమోదు కావడంతో ఈ ప్రాంతాలు నిత్యం వార్తల్లోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న భజరంగ్ ధళ్ నాయకుడు ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.

A Bajrang Dal leader who fell in love with a Muslim girl for three years and got married near Mangaluru
కంపెనీ యాజమాన్యం, హెచ్ఆర్ పేర్లు రాసి ఇంజనీరు ఆత్మహత్య, డెత్ నోట్ లో ?

మంగళూరులోని సూరత్‌కల్‌లో జరిగిన హిందూ-ముస్లిం యువతి మధ్య జరిగిన ప్రేమకథ చివరికి పెళ్లితో ముగిసింది. హిందూ సంస్థ భజరంగ్ దళ్ లో ప్రశాంత్ భండారీ అనే యువకుడు చురుకుగా ఉన్నాడు. భజరంగ్ దళ్ కార్యక్రమాల్లో ప్రశాంత్ భండారీ చాలా చురుకుగా పాల్గొంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా ప్రశాంత్ భండారి ఇంతకాలం ఆందోళనలు నిర్వహించాడు.

అయితే అదే భజరంగ్ దళ్ నాయకుడు ప్రశాంత్ భండారి ముస్లిం యువతి అయేషాను వివాహం చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మూడేళ్లుగా ప్రేమించుకున్న తర్వాత అయేషా అనే యువతి నవంబర్ 30వ తేదీన సూరత్కల్ ప్రశాంత్ భండారీతో కలిసి పారిపోయింది. తరువాత ప్రేమించిన ప్రియుడు ప్రశాంత్ భండారిని ఆయేషా పెళ్లి చేసుకున్న ఫోటోలు వైరల్‌గా మారాయి.

A Bajrang Dal leader who fell in love with a Muslim girl for three years and got married near Mangaluru
ఆయేషాను వివాహం చేసుకున్న భజరంగ్ దళ్ నాయకుడు ప్రశాంత్ భండారికి చాలా హిస్టరీ ఉంది. సూరత్‌కల్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్ జాబితాలో ప్రశాంత్ భండారి పేరు ఉంది. దీపక్ రావ్ హత్య కేసు నిందితుడు పింకీ నవాజ్‌ని హత్య చేసేందుకు ప్రశాంత్ భండారి ప్రయత్నించాడని కేసు నమోదు అయ్యింది. అయితే ఇప్పుడు ముస్లిం యువతి ఆయేషాతో ప్రేమాయణం సాగించి ఆమెనే ప్రశాంత్ భండారి పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది.

ఆయేషా తల్లిదండ్రులు సూరత్‌కల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ప్రశాంత్ భండారి మీద కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. ఇరు వర్గాలను పిలిపించి విచారణ చేసి వివరాలు సేకరించాని మంగళూరులోని సూరత్కల్ పోలీసు అధికారులు సిద్దం అవుతున్నారు. మొత్తం మీద మంగళూరులో హిందూ, ముస్లీం సోదరులు కలిసిమెలసి ఉండటానికి ఇలాంటి ప్రేమ వివాహాలు పునాది వేస్తున్నాయని కొందరు అంటున్నారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+