ర్యాపిడో బైక్ లో జాగ్రత్త, బైక్ మీద నుంచి దూకేసిన యువతి, ఎక్కడంటే అక్కడ చేతులు ?
బెంగళూరు/విజయవాడ: సిలికాన్ సిటీ బెంగళూరులో ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఓ యువతి ర్యాపిడో బైక్ బుక్ చేసింది. అయితే బైక్ పై వెళుతున్న సమయంలో యువతిని బైక్ నడుపుతున్న యువకుడు లైగింక వేధింపులకు గురి చేసి ఆమెను చిత్రహింసలకు గురి చెయ్యడంతో ఆమె వేగంగా వెలుతున్న బైక్ పై నుంచి కిందకు దూకేయడం కలకలం రేపింది.
యువతిని ర్యాపిడో రైడర్ లైంగికంగా వేధించిన ఘటన బెంగళూరులోని యలహంక నాగేనహళ్లి సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీ సమీపంలో చోటుచేసుకోవడం కలకలం రేపింది. బైక్ నడుపుతున్న వ్యక్తి లైగింక వేధింపులకు గురి చెయ్యడంతో విసిగిపోయిన యువతి ప్రాణాలకు తెగించి రన్నింగ్ బైక్ మీద నుంచి జంప్ చెయ్యడంతో ఆమెకు గాయాలైనాయని పోలీసులు అన్నారు.

ఈ సంఘటన ఏప్రిల్ 21న జరగడంతో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించిన తరువాత ర్యాపిడో బైక్ రైడర్ లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చిందని కన్నడ మీడియా తెలిపింది. యలహంక సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న యువతి ఇందిరానగర్ లో నివాసం ఉంటున్నది.
ఆ యువతి యలహంక నుంచి ఇందిరానగర్ వెళ్లేందుకు ర్యాపిడో బైక్ బుకింగ్ చేసుకుంది. బైక్‌పై వెళుతుండగా మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుందనే సాకుతో ఆ యువతి మొబైల్‌ను తీసుకున్న యువకుడు ఆ మొబైల్ అతని దగ్గరే పెట్టుకున్నాడు. అనంతరం బైక్‌పై వెళుతూ యువతి శరీరం, చేతులు, తొడలను అతని చేతులతో తాకి లైంగికంగా వేధించాడు.
బైక్‌పై నుంచి దూకిన యువతికి గాయాలైనా పట్టించుకోకుండా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి యలహంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు యువతి తెలిపిన ఆధారాలుతో, ర్యాపిడో బైక్ రైడర్ల వివరాలు సేకరించారు. చివరికి యువతిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన దీపక్ రావ్ అలియాస్ దీపక్ ను అరెస్టు చేశామని యలహంక పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications