Viral Video: ఓ పక్షి జాతీయ పతాకాన్ని ఎగురవేసిందంటే నమ్మొచ్చా- 25 సెకెండ్ల అద్భుతం

Independence Day: దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ పక్షి జాతీయ పతాకాన్ని రెపరెపలాడించింది. భారతగడ్డపై పుట్టి, భరతమాత ఒడిలో పెరుగుతున్న ప్రతి జీవిలోనూ దేశం పట్ల అపారమైన భక్తి భావం ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్టయింది.

కేరళలో చోటు చేసుకున్న ఘటన ఇది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం జాతీయ దినోత్సవ వేడుకలను నిర్వహించింది. చిన్న పిల్లలు ఇందులో పాల్గొన్నారు. స్వచ్ఛత ఉట్టిపడేలా తెలుపురంగు దుస్తులను ధరించి, చిన్న చిన్న జాతీయ పతాకాలను చేతబట్టుకుని కనిపించారు ఈ వీడియోలో.

A Bird unfurls the National Flag when it gets stuck during hoisting in Kerala

ఆ పిల్లలు, పాఠశాల ఉపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. దీనికోసం తాటి చెట్టంత ఎత్తయిన పోల్ ఏర్పాటు చేశారు. ఓ తాడుకు మువ్వన్నెల పతకాన్ని కట్టి పైకి చేర్చారు. దాన్ని ఎగురవేయడానికి ప్రయత్నించగా.. ఆ తాడుకు కట్టి ఉన్న ముడి ఎంతసేపటికీ విడిపోలేదు. .

అదే సమయంలో- ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ పక్షి శరవేగంగా త్రివర్ణ పతాకంపై వాలింది. ఎవరో ఆదేశించినట్టుగా తన ముక్కుతో జాతీయ జెండాకు కట్టివున్న తాడు ముడిని విప్పిదీసి.. అంతే వేగంతో వెనక్కి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

25 సెకెండ్ల నిడివివున్న ఈ వీడియో- సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తోన్నారు నెటిజన్లు. అమేజింగ్‌గా అభివర్ణిస్తోన్నారు. అద్భుతం అంటూ ఆశ్చర్యచకితులవుతున్నారు. దేశం పట్ల ప్రతి జీవికీ అమితమైన భక్తి ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇది నిజంగా పక్షి ఎగురవేయలేదనే డిబేట్ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై సాగుతోంది. జెండా ఎగురవేసే సమయంలో దాన్ని చిత్రీకరించే కెమెరాకు సరిగ్గా స్తంభానికి వ్యతిరేక దిశలో ఉన్న చెట్టు కొమ్మపై ఆ పక్షి వాలడం, మళ్లీ వెనక్కి ఎగిరిపోవడం మరో వీడియోలో రికార్డయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+