మోదీకి మైక్ ఇవ్వకుండా బీజేపీ లీడర్ తిక్కచేష్టలు, మోదీ ఫీలింగ్స్ చూడండి !

బెంగళూరు/హోస్ పేట్: ప్రధాని నరేంద్ర మోదీ స్టేజ్ మీద కాని, ఆ కార్యక్రమంలో ఉంటే నాయకులు ఎక్కువ సేపు సుత్తికొట్టకుండా ప్రధాని నరేంద్ర మోదీకి మైక్ ఇచ్చేస్తారు, అయితే ఓ మహానుభావుడు మాత్రం ప్రధాని మోదీని మాట్లాడనివ్వకుండా కొన్ని నిమిషాల పాటు చుక్కలు చూపించడంతో ప్రధాని నరేంద్ర మోదీ అసహనంతో ఏం చెయ్యలేక అలాగే నిలబడి అతన్ని చూస్తూ ఉండిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ కు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ స్పీచ్ ఇవ్వడం మొదలుపెడితే చాలా మంది ఆయన మాటలు వింటూ అలాగే ఉండిపోతారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు.

BJP

కర్ణాటకలోని హోస్ పేట్ లో మంగళవారం జరిగిన బీజేపీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైనారు. కన్నడ బాషలో ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ హంపి విరుపాక్షస్వామి, ఉగ్ర నరసింహస్వామి, హులిగమ్మ దేవిలకు నమస్కారం చేశారు. హనుమంతుడు జన్మించిన ఈ భూమి మీద అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

తరువాత ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. రాముడు, హనుమంతుడి భక్తులకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అంతే ప్రధాని మోదీ మాట్లాడింది. హోస్ పేట్ లో చాలా మందికి హిందీ బాష రాకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని కన్నడలోకి అనువధించడానికి ఓ నాయకుడిని స్టేజ్ మీదకు ఎక్కించారు.

BJP

ప్రధాని ప్రసంగాన్ని కన్నడలోకి అనువధిస్తున్న ఆ బీజేపీ నాయకుడు ఆయనే మోదీ అనుకున్నాడో ఏమో కాని ప్రధాని పక్కన నిలబడి ఉన్నారని, తాను మాట్లాడటం నిలిపితే మోదీ మాట్లాడతారని కొంచెం కూడా ఆలోచించకుండా ఏకదాటిగా 2 నిమిషాల 20 సెకన్లు నిలపకుండా మాట్లాడారు. తనకు మైక్ ఇవ్వకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ చాలా సేపు ఆయన వైపు చూస్తూ అలాగే వేచి చేశారు.

తన మాటలను కన్నడలోకి అనువాదం చేస్తున్న వ్యక్తి వైపు పదేపదే చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇక చాలు నిలపవయ్యా అంటూ కళ్లు తిప్పి చూసినా ఆ నాయకుడు మాత్రం మాట్లాడుతూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క నిమిషం మాట్లాడిన మాటలను సాగదీసి రెండు నిమిషాలకు పైగా ఆయన మాట్లాడటంతో బహిరంగ సభకు హాజరైన బీజేపీ కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు

కన్నడలోకి అనువాదం చేస్తున్న వ్యక్తి వైపు ప్రధాని నరేంద్ర మోదీ ఆసహనంతో చూసిన చూపుల వీడియో క్లిప్పింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో, కన్నడ టీవీ చానల్స్ లో వైరల్ అయ్యాయి. ప్రధాని మోదీ స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్న రోజుల్లో ఓ వ్యక్తి మైక్ ఇస్తే చాలు మాట్లాడదాము అని మోదీ ఇంతకు ముందు ఇంత సేపు ఎక్కడా వేచి చూడలేదేమో పాపం, ఈ రోజు మోదీ సహనాన్ని పరీక్షించిన ఆ నాయకుడికి బీజేపీ నాయకులు వీరలెవల్లో క్లాస్ పీకుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+