సీఎంకు చాలా క్లోజ్ లీడర్ ను పోలీస్ స్టేషన్ లో కాల్చిపారేసిన ఎమ్మెల్యే, రేయ్ నీ అంతు చూస్తా, కథ!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన అధినేతపై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. భూవివాదానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ అర్దరాత్రి పోలీసు స్టేషన్‌లోనే సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలోని శివసేన నాయకుడు మహేశ్ గైక్వాడ్‌పై కాల్పులు జరిపడం కలకలం రేసింది. బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ అరెస్టు అయ్యాడు.

మహారాష్ట్రలోని థానే జిల్లా ఉల్లాసబగరలోని హిల్ లైన్ పోలీస్ స్టేషన్ వద్ద శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) నాయకుడు మహేష్ గైక్వాడ్ మద్దతుదారులపై బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ మద్దతుదారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మహేష్ గైక్వాడ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చేరాడు. శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని పోలీసు అధికారులు తెలిపారు.

A BJP MLA who shot a Shiv Sena leader with a revolver in front of everyone in the police station

ముంబాయి నగరాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణ్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి గణపత్ గైక్వాడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించాడు. మహారాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీలు పొత్తు పెట్టుకుని అధికారంలో ఉన్నాయి. శుక్రవారం ఇరువర్గాలు ఉల్లాసానగర్‌లోని హిల్‌లైన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని భూవివాదానికి సంబంధించి ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ సమయంలోల ఇరు వర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసింది.

అప్పటికే శుక్రవారం అర్దరాత్రి అయిపోయింది. బీజేపీ ఎమ్మెల్యే గణతప్ గైక్వాడ్ తో పాటు అతని అనుచరులు శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన శివసేన నాయకుడు మహేష్ గైక్వాడ్ తో పాటు అతని మద్దతుదారులను ఆస్పత్రికి తరలించారు. మహేశ్ గైక్వాడ్ శరీరం నుంచి ఐదు బుల్లెట్లను బయటకు తీశామని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

ఈ ఘటన తర్వాత అరెస్టు అయిన బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ, మహేష్ గైక్వాడ్ కబ్జా చేసినట్లు చెబుతున్న భూమికి సంబంధించిన సమస్య ఉందని. తన కుమారుడితో దురుసుగా ప్రవర్తించడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపానని చెప్పాడు. మహేష్ గైక్వాడ్, బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ మధ్య అనేక వివాదాలున్నాయని, దీంతో ఫిర్యాదు చేసేందుకు హిల్ లైన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారని, కానీ గణపత్ గైక్వాడ్ చర్చల సమయంలో మహేష్ గైక్వాడ్, అతని సహచరులపై కాల్పులు జరిపాడని, ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) సుధాకర్ పఠారే శనివారం మీడియాకు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+