అక్రమ సంబంధంతో ఎంజాయ్, ఆంటీని చంపేసి ఆరు నెలలు ఏం చేశాడంటే ?
బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. కొడుకు పెళ్లి వయసుకు వస్తున్నాడు. ఇదే సందర్బంలో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆంటీ ఆమె ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైయ్యింది. హత్య జరిగిన చాలా నెలల వరకు మ్యాటర్ బయటకు రాలేదు.
ఐదు నెలల క్రితం హత్య చేసి మృతదేహాన్ని అడవిలో పూడ్చిపెట్టిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకాలో చోటుచేసుకుంది. వాసంతి (45) హత్యకు గురైన మహిళ. ఏప్రిల్ 29వ తేదీ ఉదయం శృంగేరి తాలూకాలోని త్యావాన్ సమీపంలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన వాసంతి కనిపించకుండా పోయింది. ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్లి ఉండొచ్చని కొడుకు నవీన్ ఆమె కోసం వెతికాడు.

మృతి చెందిన మహిళను తాలూకాలోని నెమ్మార్‌లోని హోస్కెరె సైట్‌కు చెందిన వాసంతి (45)గా గుర్తించారు. కలసకు చెందిన నిరాశ్రయుడైన ప్రకాష్ అరెస్టు అయిన నిందితుడు. కలసకు చెందిన ప్రకాష్ (29) థివాన్‌లోని ఒక తోటలో పనిచేస్తూ హొస్కెరె సైట్‌కు చెందిన వాసంతితో ఏడాది కాలంగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
వాసంతి కుమారుడు నవీన్ ఏప్రిల్ 4న పోలీస్ స్టేషన్‌లో తన తల్లి కనపడటం లేదని మిస్సింగ్ కేసు పెట్టాడు. పలు సాక్ష్యాలను పరిశీలించి, గ్రామంలోని ప్రజాప్రతినిధులను ప్రశ్నించగా, వీరిద్దరూ ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నట్లు నిర్ధారణ అయింది. విచారణాధికారి ప్రకాష్‌ని మరింత లోతుగా విచారించగా, ప్రకాష్‌కు వివాహిత వాసంతితో అక్రమ సంబంధం ఉందని వెలుగు చూసింది.

ప్రకాష్‌లు మార్చి 29న కంకుట్‌లుకు వెళ్లాడు. అప్పటికే ప్రకాష్ వివాహం అయ్యిందని తెలుసుకున్న వాసంతి ఆంటీ రగిలిపోయింది. ప్రకాష్ పెళ్లి విషయం తెలుసుకున్న వాసంతికి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఆగ్రహించిన ప్రకాష్ వాసంతిపై దాడి చేశాడు. దీంతో వాసంతి అక్కడికక్కడే మృతి చెందడంతో ఆమె ప్రియుడు ప్రకాష్ హడలిపోయాడు.
చెట్టుకింద మట్టిలో వాసంతి శవం పూడ్చిపెట్టి ఏమీ తెలీకుండా ప్రకాష్ సైలెంట్ గా ఉండిపోయాడు. ప్రకాష్, వాసంతిల ఇద్దరి మొబైల్ కాల్స్ వివరాలను పోలీసులు పరిశీలించి ప్రకాశ్‌ను తదుపరి విచారణకు అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు మ్యాటర్ బయటకు వచ్చిందని ఎస్పీ ఉమా ప్రశాంత్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications