వివాహిత మహిళతో లస్క్ టపా, ఇంకా ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్, ప్రియుడి ప్లాన్ బి !
బెంగళూరు/దావణగెరె: నాలుగు నెలల క్రితం అదృశ్యమైన మహిళ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహితను ఆమె ప్రియుడు నమ్మించి పిలుచుకుని వెళ్లాడు. నీకు నీ మొగుడితో పాటు నేను పడక సుఖం ఇస్తున్నాము కదా, ఇంకా కొందరితో నువ్వు ఎందుకు అక్రమ సంబందం పెట్టుకున్నావు ?, నీకు కొవ్వు పట్టింది. నువ్వు చాలా కామంతో రగిలిపోతున్నావు అంటూ వివాహిత మహిళను ఆమె ప్రియుడే హత్య చేసి మృతదేహం ఎవ్వరికి కనిపించకూడదని శవాన్ని కాల్చి బూడిద చేశాడు.
కర్ణాటకలోని విజయనగరం జిల్లా హరప్పనహళ్లి తాలూకా హలవాగులు స్టేషన్ పోలీసులు మహిళ హత్య కేసును ఛేదించారు.

హలవలు పోలీస్ స్టేషన పరిధిలోని నిట్టూరు గ్రామానికి చెందిన కవిత అనే మహిళకు వివాహం అయ్యింది. కవితకు పిల్లలు లేరు భర్తతో కలిసి కవిత చక్కగానే కాపురం చేసుకుంటున్నది. భర్తతో కాపురం చేసుకుంటున్న కవితకు విజయనగర జిల్లాలోని కుంచూరు గ్రామానికి చెందిన సలీమ్ మున్నాఖాన్ అలియాస్ సలీమ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
రానురాను కవిత, సలీమ్ చనువు పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేశారు. పుట్టింటికి వెలుతున్నానని భర్తకు చెబుతున్న కవిత నేరుగా ప్రియుడు సలీమ్ దగ్గరకు వెళ్లి అతనితో తిరుగుతూ ఎంజాయ్ చేసింది. నాలుగు నెలల క్రితం కవిత దావణగెరెలోని పుట్టింటికి వెళ్లింది. దావణగెరెలోని ఆలూరు గ్రామంలోని పుట్టింటిలో ఉన్న కవిత గత ఫిబ్రవరి 23వ తేదీన తాను హరిహరకు వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిన కవిత తరువాత ఆమె ఇంటికి తిరిగి రాలేదు.
రెండు మూడు రోజులు కవిత కోసం వేచి చూసిన ఆమె కుటుంబ సభ్యులు నిట్టూరు గ్రామంలో నివాసం ఉంటున్న కవిత భర్తకు ఫోన్ చేసి ఆరా తీశారు. అత్తారింటికి కూడా కవిత వెళ్లకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కవిత కనపడటం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె కోసం గాలించారు. అయితే కవిత ఆచూకి మాత్రం చిక్కలేదు.

హరిహరకు వెళ్తున్నట్లు పుట్టింటిలో చెప్పిన కవిత ఆరోజు నేరుగా తెల్గి గ్రామానికి వెళ్లింది. అక్రమ సంబంధం పెట్టుకున్న సలీమ్ ప్రియురాలు కవితను అతని బైక్‌పై ఎక్కించుకుని కుంచూరు చెరువు సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ సమయంలో ఫోన్‌లో మాట్లాడుకునే విషయంలో కవిత, సలీమ్ మధ్య గొడవ మొదలైంది. నీ ఫోన్ ఎప్పుడు బిజీగా ఉంటుందని, నాతో కాకుండా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ సలీమ్ అతని ప్రియురాలు కవితను నిలదీశాడు.
నాతో కాకుండా వేరే వారితో నీకు అక్రమ సంబంధం ఉందా, నీకు నేను, నీ మొగుడు సరిపోమా ?, నీకు కొవ్వు, కామం ఎక్కువ అయ్యి వేరే మగాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుని కులుకుతున్నావని సలీమ్ అతని ప్రియురాలు కవితతో గొడవపడ్డాడు. కవిత, సలీమ్ ఇదే విషయంలో పెద్దగా గొడవ పడ్డారు. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో కోపోద్రిక్తుడైన సలీమ్ అతని ప్రియురాలు కవిత పంజాబీ డ్రెస్ వేల్ తో ఆమె గొంతు నులిమి ఆమెను చెరువు సమీపంలోనే హత్య చేశాడు.
ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు సలీమ్ అతని ప్రియురాలు కవిత మృతదేహాన్ని తెలిసిన వారి పొలంలోకి తీసుకెళ్లి గొయ్యి తీసి శవాన్ని అందులో వేసి పెట్రోల్ పోసి తగులబెట్టి కాల్చి బూడిద చేశాడు. ప్రియురాలు కవిత శవాన్ని పూర్తిగా కాల్చేసిన తరువాత సలీమ్ అతని ఇంటికి చేరుకున్నాడు. ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత నిందితుడు సలీమ్ అతని స్నేహితుడికి జరిగిన విషయాన్ని చెప్పాడు.
నువ్వు, నేను ఒకే మతానికి చెందిన వారమని, నువ్వు నన్ను కాపాడాలని, తనకు భార్యా, పిల్లలు ఉన్నారని సలీమ్ అతన్ని వేడుకున్నాడు. సలీమ్ అతని ప్రియురాలు కవితను హత్య చేసిన విషయం అక్కడా ఇక్కడా తెలిసి చివరికి ఆ విషయం కవిత కుటుంబ సభ్యులకు తెలిసింది. కవిత కుటుంబసభ్యులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సలీమ్ గురించి సమాచారం అందించారు.

పోలీసులు నిందితుడు సలీమ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారించగా ఆమె హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. కవితను ఎలా హత్య చేశాను. ఆమె శవాన్ని ఏం చేశాను అంటూ సలీమ్ పోలీసులకు పిన్ టూ పిన్ చెప్పాడు. కేసు విచారణలో ఉంది. మొత్తం మీద ప్రియుడి మోజులో తిరుగుతున్న వివాహిత మహిళ చివరికి అదే ప్రియుడి యేతిలో దారుణ హత్యకు గురికావడం విజయగర జిల్లాలో కలకలం రేపింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications