ప్రియురాలిని చంపేసి వాటర్ ట్యాంక్ లో శవం దాచిపెట్టిన కొత్త పెళ్లికొడుకు, భార్యతో !

లక్నో/ ఉత్తరప్రదేశ్: తన ప్రియురాలిని హత్య చేసి శవాన్ని నిర్మాణంలో ఉన్న ఇంటిలోని వాటర్ ట్యాంక్‌లో దాచిపెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ప్రయోగ్ రాజ్ లో కలకలం రేపింది. యమునాపర్ కర్చన పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేవా ప్రాంతంలోని నిందితుడు అరవింద్ ఇంటి నుంచి రాజ్ కేసర్ అలియాస్ కేసర్ (35) అనే మహిళ మృతదేహం స్వాదీనం చేసుకున్నామని పోలీసు అధికారులు శనివారం తెలిపారు.

15 రోజుల క్రితం అరవింద్ అతని ప్రియురాలు కేసర్‌ను హత్య చేసి ఆమె మృతదేహాన్ని ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో దాచి పెట్టాడని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విశ్వజీత్ సింగ్ తెలిపారు. మే 30న తమ కూతురు కనిపించడం లేదంటూ కేసర్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసర్ ఫోన్ కాల్ సమాచారం సేకరించిన పోలీసులు అరవింద్‌కు ఫోన్ చేసి పిలిపించి అతన్ని విచారించారు. ఆ తర్వాత అరవింద్ తానే తన ప్రియురాలు కేసర్ ను హత్య చేశానని అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు.

groommurder

కేసర్ మృతదేహాన్ని వాటర్ ట్యాంక్ నుండి బయటకు తీసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. కేసర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో కేసర్ ను తానే హత్య చేసినట్లు అరవింద్ అంగీకరించాడు. దాదాపు 15 రోజుల క్రితం కేసర్ ను హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లో ఉంచినట్లు అరవింద్ పోలీసులకు చెప్పాడు. ఆశిష్ అలియాస్ అరవింద్ ఏడేళ్లుగా కేసర్ తో ప్రేమలో ఉన్నాడు. ఇంతలో అరవింద్ కు వేరే అమ్మాయితో పెళ్లిని అతని కుటుంబ సభ్యులు ఫిక్స్ చేశారు. మే 28న అరవింద్ కు వేరే అమ్మాయితో వివాహం జరిగింది.

అయితే అరవింద్ పెళ్లి చేసుకోవడానికి అతని ప్రియురాలు కేసర్ అంగీకరించలేదు. ఆ పెళ్లిని ఎలాగైనా ఆపాలని కేసర్ అనేక రకాలుగా ప్రయత్నించింది. అయితే అందుకు అంగీకరించిన అరవింద్ మే 24న తన ఇంట్లో ఆమెను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో దాచాడు.

మే 24న అరవింద్ తన ప్రియురాలు కేసర్ ను మాట్లాడాలనే నెపంతో ఇంటికి పిలిపించుకుని నిర్మాణంలో ఉన్న ఇంట్లో హత్య చేశాడు. అయితే పోలీసుల విచారణను పక్కదారి పట్టించాలని భావించిన అరవింద్ అతని ప్రియురాలు కేసర్ కుటుంబీకులతో కలిసి ఆమె ఆచూకీ కోసం వెతికినట్లు ప్రయత్నించాడని పోలీసు అధికారులు చెప్పారు. అయితే కేసర్ కాల్ డేటాతో కొత్త పెళ్లి కొడుకు అడ్డంగా చిక్కిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+