Cheating: చెల్లెలికి చుక్కులు చూపించిన ప్రియుడు, చేసినోడిని వదిలేసి చూసినోడిని చంపిన అన్న !

చెన్నై/ కడలూరు/ మదురై: ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువతిని ఓ యువకుడు మోసం చేశాడు. ఇంతకాలం తనతో తిరిగి ఎంజాయ్ చేసి తీరా పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిపై కేసు పెట్టిన యువతి అతన్ని జైలుకు పంపించింది. తన చెల్లెలును ప్రియుడు మోసం చెయ్యడానికి అతని స్నేహితుడు సహకరించాడని ఆవేశంతో రగిలిపోయిన అన్న ప్రియుడి స్నేహితుడిపై పగ పెంచుకున్నాడు. చెల్లిని మోసం చేసిన వాడిని వదిలేసి వారి ప్రేమ వ్యవహారం చూసినోడిని కత్లితో పొడిచి చంపేశాడు. స్నేహితుడి ప్రేమకు సహకరించిన యువకుడు హత్యకు గురి కావడంతో కడలూరులో కలకలం రేపింది.

 తరంగిణి లవ్ స్టోరి

తరంగిణి లవ్ స్టోరి

తమిళనాడులోని కడలూరు జిల్లా బమ్రాట్టి సమీపంలోని తరువదిగై మండపం వీధిలో నివాసం ఉంటున్న శక్తివేల్ అనే యువకుడు తరంగిణి అనే యువతిని ప్రేమించాడు. నువ్వులేక నేనులేను.... నువ్వేనాకు ప్రాణం అంటూ శక్తివేల్, తరంగిణి ఇంతకాలం కలిసితిరిగారు. నేనునిన్ను పెళ్లి చేసుకుంటానని శక్తివేల్ అతని ప్రియురాలు తరంగిణికి మాయమాటలు చెప్పాడు.

 ఏ నిమిషానికి ఏమి జరుగునో !

ఏ నిమిషానికి ఏమి జరుగునో !

ప్రియురాలు తరంగిణిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన శక్తివేల్ ఆమెను బైక్ లో పిలుచుకుని ఇన్ని రోజులు షికార్లు తిరుగుతూ రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెతో ఎంజాయ్ చేశాడు. మనం పెళ్లి చేసుకుందామని, ఇంకా ఎన్నిరోజులు ఇలా తిరుగుతామని ఇటీవల తరంగిణి ప్రియుడు శక్తివేల్ మీద ఒత్తిడి చేసింది .అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోనని, ఏదో సరదాగా తిరిగాము నువ్వు మరిచిపో, నేను మరచిపోతా అంటూ శక్తివేల్ పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పి అడ్డం తిరిగాడు.

 ప్రియుడిని జైలుకు పంపించిన ప్రియురాలు

ప్రియుడిని జైలుకు పంపించిన ప్రియురాలు

తనను పెళ్లిపేరుతో మాయమాటలు చెప్పి తనను లొంగదీసుకుని తనపై బలవంతంగా లైంగికదాడి చేసి అత్యాచారం చేసి మోసం చేశాడని ప్రియుడు శక్తివేల్ మీద అతని ప్రియురాలు తరంగణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు శక్తివేల్ ను అరెస్టు చేసి జైలకు పంపించారు .ఇదే సమయంలో తరంగిణి తన ప్రియుడు శక్తివేల్ కు అతని స్నేహితుడు శాంతకుమార్ సమాయం చేశాడని ఆమె అన్న జ్ఞానవేల్ కు చెప్పిందిని సమాచారం.

 గుడిలో రాయబారం జరిగింది ?

గుడిలో రాయబారం జరిగింది ?

శాంతకుమార్ ఓ ఆలయంలో పని చేస్తున్నాడు. ఆలయానికి వచ్చి వెలుతున్న తన చెల్లెలు తరంగిణికి శక్తివేల్ పరిచయం కావడానికి, వారు ప్రేమించుకోవడానికి శాంతకుమార్ కారణం అయ్యాడని జ్ఞానవేల్ కు తెలిసింది. అంతే శాంతకుమార్ సహాయంతోనే శక్తివేల్ తన చెల్లెలు తరంగిణిని మోసం చేశాడని జ్ఞానవేల్ రగలిపోయాడు. ఇదే సమయంతో తమ ప్రేమ వ్యహారం మొత్తం శాంతకుమార్ కు తెలుసు అని ప్రియురాలు తరంగణి ఆమె అన్న జ్ఞానవేల్ కు చెప్పింది.

 చేసినోడిని వదిలేసి చూసినోడిని చంపేసిన అన్న

చేసినోడిని వదిలేసి చూసినోడిని చంపేసిన అన్న

నీవల్ల నా చెల్లెలి జీవితం నాశనం అయ్యిందని ఆవేవంతో రగిలిపోయిన జ్ఞానవేల్ కత్తి తీసుకుని వెళ్లి శాంతకుమార్ ను ఇష్టం వచ్చినట్లు పొవడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చెల్లెలిని మోసం చేసింది శక్తివేల్ అయితే వారి ప్రేమ వ్యవహారం కళ్లతో చూసినందుకు శాంతకుమార్ కు ఆమె అన్న జ్ఞానవేల్ దండేసి దండం పెట్టాశాడని స్నేహితులు వాపోతున్నారు. శాంతకుమార్ ను హత్య చేసిన జ్ఞానవేల్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+