జీవితం హ్యాపీ అనుకున్న లేడీ టీచర్, రూ 10 లక్షలు కోసం ?, అంతా అక్కడే !
విద్యార్థులకు విద్యను బోధించి, పిల్లల జీవితాలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయురాలు పదవీ విరమణ తర్వాత సంతోషంగా జీవితాన్ని గడపాలి అనుకుంది. కానీ డబ్బుకు ఆశపడి రిటైడ్ లేడీ టీచర్ వడ్డీకి డబ్బులిచ్చింది. వడ్డీకి డబ్బులు తీసుకున్న వ్యక్తి రిటైర్డ్ టీచర్ ను హత్య చేశాడు. తొలుత సహజ మరణంగా భావించిన పోలీసులు విచారణ అనంతరం హత్య కేసుగా గుర్తించారు.
అప్పు తీర్చలేక హత్య చేసిన నిందితుడు ఇప్పుడు పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు. కర్ణాటకలోని ధారవాడ సిటీలోని ఓం నగర్‌కు చెందిన రిటైర్డ్ టీచర్ గిరిజా నదురామత్ అలియాస్ గిరిజా హత్యకు గురయ్యారు. గిరిజాకు పిల్లలు లేరు. లేడీ టీచర్ గిరిజా భర్త కూడా చనిపోయారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు అయన గిరిజా ఇటీవలే పదవీ విరమణ చేశారు. అయితే గిరిజా ఈ నెల 15వ తేదీన మృతి చెందింది. గిరిజా మరణం సహజమేనని తొలుత అందరూ భావించారు.

8 రోజుల తర్వాత గిరిజా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఇంట్లో కనిపించింది. అయితే గిరిజా వడ్డీ వ్యాపారం సంగతి తెలిశాక పోలీసుల విచారణలో గిరిజాది హత్య అని విచారణలో తేలింది. ధారవాడలోని అమరగోళ గ్రామానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తికి గత ఏడాది గిరిజా రూ.10 లక్షలు ఇచ్చారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వాలని గిరిజా రెండు నెలల క్రితం డిమాండ్ చేసింది. కానీ డబ్బు తిరిగి ఇవ్వడానికి మంజునాథ్ అంగీకరించలేదని తెలిసింది.
వడ్డీతో సహా డబ్బు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టిన గిరిజా వేధింపులకు కోపోద్రిక్తుడైన మంజునాథ్ ఆమెను హత్య చేసేందుకు పథకం పన్నాడు.
రిటైర్డ్ టీచర్ గిరిజా ఇంటికి వెళ్లిన మంజునాథ్ తాగేందుకు మంచినీళ్లు అడిగాడు. నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్న గిరిజాను ఆమె పంజాబి డ్రెస్ వేల్ తోనే గొంతు నులిమి హత్య చేశాడు. హత్యకు గురైన గిరిజా మృతదేహాన్ని ధారవాడలోని విద్యాగిరి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.
గిరిజాది సహజ మరణం కాదని, ముందే ప్లాన్ చేసి ఆమెను హత్య చేశారని తెలిసింది. గిరిజా చనిపోయిన 8 రోజుల తర్వాత మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో ఇరుగుపొరుగు వారు వాసన భరించలేక పోలీసులకు సమాచారం అందిచారు. చుట్టుపక్కల వారికి గిరిజా వడ్డీకి డబ్బులు ఇచ్చి వ్యాపారం చేస్తోందని పోలీసులు గుర్తించారు. గిరిజా దగ్గర అప్పు తీసుకున్న మంజునాథ్ తీసుకున్న డబ్బుతో పాటు అసలు ఇవ్వకుండా ఆమెను హత్య చేసి మాయం అయ్యాడు.

గిరిజా గత ఏడాది వడ్డీకి రూ. 10 లక్షల రూపాయలు మంజునాథ్ కు చెల్లించారని పోలీసులు గుర్తించారు. అయితే వడ్డీ కట్టలేని మంజునాథ్ కు పదే పదే ఫోన్ చేసిన గిరిజా డబ్బులు అడిగారని పోలీసులు గుర్తించారు. డబ్బులు తిరిగి చెల్లించాల్సిన మంజునాథ్ మాత్రం ఎలాంటి క్లూ చిక్కకుండా ఆమెను హత్య చేసి పరారయ్యాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారించగా గిరిజాది హత్యేనని నిర్ధారణ అయింది. నిందితుడు మంజునాథ్ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని హుబ్బళి-ధారవాడ జంట నగరాల పోలీస్ కమిషనర్ రేణుకా సుకుమార్ తెలిపారు.












Click it and Unblock the Notifications