Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఫ్రెండ్ భార్యతో రొమాన్స్ చేస్తున్న వ్యాపారి, ఫ్రెండ్ కోసం వెళ్లి ?, జనాభా లెక్కల్లో పేరు మాయం !

చెన్నై/హోసూరు: అడవిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. యువకుడి శవం గుర్తించిన స్థానికులు పోలీసులకు, అటవి శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేశారు. యువకుల మిస్సింగ్ కేసుల గురించి పోలీసులు ఆరా తీశారు. ఇదే సమయంలో ఓ వ్యాపారి కనపడటం లేదని పోలీసులు తెలుసుకున్నారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం యువకుడి ప్రాణం తీసిందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

 మాయం అయిన యువకుడు

మాయం అయిన యువకుడు

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని హోసూరు సమీపంలోని పేరడంపల్లి అడవిలో ఓ యువకుడు శవం గుర్తించారు. అటవీశాఖ ఇచ్చిన సమాచారం మేరకు అట్కో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. హత్యకు గురైన యువకుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీశారు. పోలీసుల విచారణలో హోసూరుకు చెందిన ఓ వ్యక్తి తన సోదరుడు సిలంబరసన్‌ (29) కనిపించడం లేదని హోసూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని గుర్తించారు. అడవిలో చిక్కిన శవం సిలంబరసన్ దే అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 ఇద్దరూ ఫ్రెండ్స్

ఇద్దరూ ఫ్రెండ్స్

పోలీసుల విచారణలో సిలంబరసన్ గురించి దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగు చూశాయి. హోసూరు రాజు వీధిలో తల్లిదండ్రులతో కలిసి నివసించే సిలంబరసన్‌కు ఇంకా పెళ్లికాలేదని పోలీసులు గుర్తించారు. హోసూర్ బస్ స్టేషన్ సమీపంలోని పుష్కరిణిలో సిలంబరసన్ కూరగాయలు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. మరో పుష్కరణి సమీపంలో కుమార్ అనే వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. చాలా సంవత్సరాల నుంచి కుమార్, సిలంబరసన్ స్నేహితులుగా ఉన్నారని పోలీసులు అన్నారు.

 ఫ్రెండ్ భార్యతో రొమాన్స్

ఫ్రెండ్ భార్యతో రొమాన్స్

కుమార్‌ కొన్ని సంవత్సరాల క్రితం వైరమణి అనే మహిళను వివాహం చేసుకోవడంతో అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిలంబరసన్‌ను అతని స్నేహితుడు కుమార్ ఎక్కువగా అతని ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇదే సమయంలో కుమార్ భార్య వైరమణి, సిలంబరసన్ మధ్య చనువు ఏర్పడి ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టారు. చాలాకాలం ఈ విషయం సీక్రేట్ గా సాగిపోయింది. అయితే కొన్ని నెలల క్రితం ఈ విషయం తెలుసుకున్న కుమార్ అతని భార్య వైరమణితో సహ స్నేహితుడు సిలంబరసన్ ను మందలించాడు.

 పక్కాప్లాన్ తో చంపేసిన భర్త

పక్కాప్లాన్ తో చంపేసిన భర్త

కుమార్ మందలించినా పట్టించుకోని సిలంబరన్ అతని ఫ్రెండ్ భరా్య వైరమణితో టచ్ లో కొనసాగుతూ ఆమెతో రొమాన్స్ చేస్తూ వచ్చాడు. కోపోద్రిక్తుడైన కుమార్ అతని ఫ్రెండ్ సిలంబరసన్‌ని చంపాలని ప్లాన్ చేస్తాడు. హత్యకు పథకం వేసిన కుమార్ ప్లాన్ ప్రకారం తన భార్య వియంలో నీతో మాట్లాడాలని చెప్పి సిలంబరసన్‌ని టాటా సుమోలో తీసుకెళ్లాడు. సిలంబరసన్‌ను పెరండపల్లి అడవుల్లోకి తీసుకెళ్లిన కుమార్, అతని సవతి తల్లి కుమారుడు షణ్ముగం తో కలిసి కర్రు, ఇనుప రాడ్లతో కొట్టి సిలంబరసన్ ను చంపేసి శవాన్ని అడవిలో విసిరేసి వెళ్లిపోయారు. . పోలీసులు కుమార్, షణ్ముగం ఇద్దరినీ అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన సుమో కారును కూడా స్వాధీనం చేసుకున్నారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+