ఉత్తరప్రదేశ్‌లో ట్రక్కున ఢీకొన్న కారు.. ఐదుగురు వైద్యులు మృతి..
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్ జిల్లాలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై అతివేగంగా దూసుకెళ్లిన కారు అదుపు తప్పి నేరుగా ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. స్థానికులు అందించన సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు.. కన్నౌజ్ జిల్లాలోని తిర్వా కొత్వాలి ప్రాంతంలోని సుమారు 196 కిలోమీటర్ల దూరంలో నేటి (బుధవారం) తెల్లవారుజూమున ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుగా వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టినట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. చనిపోయిన వారిలో ఐదుగురు వైద్యులు ఉన్నట్లు సమాచారం. మృతులు సైఫాయ్ మెడికల్ కాలేజీకి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.













Click it and Unblock the Notifications