కారులో వెళ్తుంటే కుంగిన రోడ్డు, భయాందోళన (ఫోటో)
చెన్నై: రోడ్డు పైన వాహనంలో వేగంగా వెళ్తుంటే ఒక్కసారిగా ఆ రోడ్డు కుంగిపోతే ఎలా ఉంటుంది? తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఇది శుక్రవారం నాడు ఉదయం జరిగింది.

ఓ కారు చెన్నైలోని ఓ హోటల్ మీదుగా దూసుకెళ్తోంది. అప్పుడు హఠాత్తుగా రోడ్డు కుంగిపోయింది. రోడ్డు మొత్తం చెక్కలు అయింది. దీంతో ఆ కారు కూడా కొంత కిందకు కుంగింది. అనంతరం ఆ కారును అధికారులు బయటకు తీశారు.

మెట్రో రైలు పనులు తదితర కారణాల వల్ల తమ తమ ఇళ్లు, రోడ్లకు బ్రేక్స్ వస్తున్నాయని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు గతంలో గోడు వెల్లబోసుకున్నారు. కాగా, కారు ఒక్కసారిగా రోడ్డు లోపలకి వెళ్లడంతో దానిని చూస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications
