20 నిమిషాల పాటు లిప్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి..
ప్రస్తుతం ఏ నగరంలో చూసినా అపార్టెమెంట్ కల్చరే కనిపిస్తోంది. ఇక అపార్టెమెంట్‌లంటే తప్పకుండా లిప్ట్‌లు ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఏ అపార్ట్‌మెంట్‌లో చూసినా లిప్ట్‌లతో ఇబ్బందులు పడుతున్న ప్రజల గురించిన వార్తలే చూస్తున్నాం. సరైన నిర్వహన లేకపోవడం వల్ల లిప్ట్‌లు తరచుగా మొరాయిస్తుంటాయి. డోర్ తెరుచుకోకపోవడం, మధ్యలో ఆగిపోవడం వంటివి ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తునే ఉన్నాం.
వీటివల్ల అపార్టుమెంట్ వాసులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే, తాజాగా ఓ చిన్నారి లిప్ట్‌లో ఇరుక్కుపోయిన సంఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ఆ చిన్నారి దాదాపు 20 నిమిషాల పాటు లిప్ట్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించింది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. .
ఈ అపార్ట్‌మెంట్‌లో ఎన్నో కుటుంబాలు : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో కుర్సీ రోడ్‌లో జ్ఞానేశ్వర్ ఎన్‌క్లేవ్ ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌లో ఎన్నో కుటుంబాలు ఉంటాయి. అపార్ట్ మెంట్ లోని బి-1105 ఫ్లాట్‌లో నివాసం ఉంటున్న ధ్వని అవస్థి అనే చిన్నారి బుధవారం మధ్యాహ్నం సమయంలో లిప్ట్ ఎక్కింది.
అయితే.. ఆ చిన్నారి ఎక్కిన మరుక్షణమే కరెంటు పోయింది. దీంతో లిప్ట్ సడెన్ గా ఆగిపోయింది. లిప్టులో ఆ చిన్నారి ఒంటరిగా ఉండటంతో తీవ్ర భయాందోళనకు గురైంది. అప్పటికి ఎంతో ధైర్యం చేసుకుని లిప్ట్ డోర్ తీసే ప్రయత్నం చేసింది. కానీ ఆ చిన్నారి చేసిన ప్రయత్నం ఫలించలేదు.

దాదాపు 20 నిమిషాల పాటు : అయితే, ఆ చిన్నారి ఆ సమయలో స్కూల్ యూనిఫామ్‌లోనే ఉంది. అయితే, ఎంతసేపటికి డోర్ తెరుచుకోకపోవడంతో, ఆ చిన్నారి గట్టిగా అరవడం, ఏడవడం మొదలుపెట్టింది. లిప్ట్‌లో కెమెరా ఉండడం గమనించింది ఆ చిన్నారి. ఆ కెమెరా వైపు చూస్తూ చేతులు జోడించి వేడుకుంది. దేవుడా నన్ను రక్షించు అంటూ ప్రార్థించడం ఆ వీడియోలో మనం గమనించవచ్చు.
ఇలా ఆ చిన్నారి దాదాపు 20 నిమిషాల పాటు లిప్ట్‌లో నరకయాతన అనుభవించింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆ బాలిక లిప్ట్‌లో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. కరెంట్ రావడంతో 20 నిమిషాల తర్వాత ఆ చిన్నారి సురక్షితంగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
విద్యుత్ అంతరాయమే కారణం : విద్యుత్తు అంతరాయం కారణంగానే ఆ చిన్నారి లిప్ట్‌లో ఇరుక్కుపోయిందని, వెంటనే ఆమెను రక్షించారని అపార్ట్ మెంట్ నిర్వహకులు చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా 12 ఏళ్లలోపు పిల్లలను లిప్ట్‌లో ఒంటరిగా ప్రయాణించేందుకు అనుమతించవద్దని నివాసితులను ఆయన అభ్యర్థించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నారి దాదాపు 20 నిమిషాల పాటు లిప్ట్‌లో ఎంత వేదన అనుభవించిందో ఆ వీడియోలో చూడొచ్చు. కాబట్టి ఇకనైనా పిల్లలను కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.












Click it and Unblock the Notifications