అంత పెద్ద కొండచిలువను అమాంతం మింగిన కింగ్ కోబ్రా
బెంగళూరు: సాధారణంగా పాములు.. కప్పలు, ఎలుకలు, చిన్న కోడి పిల్లలు లాంటి జీవులను ఆహారంగా తీసుకుంటుంటాయి. కొన్ని పెద్ద పాములు చిన్న చిన్న పాములనే ఆహారంగా తినేస్తుంటాయి. కొన్ని పాములు తమ పిల్లలను తామే తింటుంటాయనేది కూడా తెలిసిన విషయమే. కింగ్ స్నేక్ జాతికి చెందిన పాములు తనను తాను మింగడానికి ప్రయత్నించిన సందర్భాలు కూడా లేకపోలేదు.
చిన చేపలను పెద చేపలు ఆహారంగా గుటకాయ స్వాహా చేసినట్లే- కొన్ని పాములు తోటి పాములను కూడా తినే సందర్భాలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇదేదో ఏ అమెజాన్, లేక దక్షిణాఫ్రికా అడవుల్లోనో..జరగలేదు. డిస్కవరీ ఛానల్ కోసమో చిత్రీకరించిన సీనూ కాదు.

కర్ణాటకలోని మైసూరులో చోటు చేసుకుంది. మైసూరు బోగాది థర్డ్ క్రాస్ లే అవుట్‌లో కనిపించిన ఈ దృశ్యం ఆశ్చర్యానికి గురి చేసింది. కింగ్ కోబ్రా.. భారీ కొండచిలువను అమాంతం మింగేసిది. సుమారు అయిదు అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువతో తలపడిన కింగ్ కోబ్రా.. దాన్ని తల నుంచి తోక వరకూ గుటకాయ వదలకుండా తినేసింది.

సాధారణంగా కింగ్ కోబ్రా గానీ, ఇతర జాతులకు చెందిన పాములు.. చిన్న చిన్న పాములను ఆహారంగా తీసుకోవడం సహజమే అయినప్పటికీ- ఈ ఘటన మాత్రం గగుర్పాటు కలిగించింది. అయిదు అడుగుల పొడవు ఉండే కొండచిలువను లొట్టలేసుకుంటూ తినడం అనేది అసాధారణంగా భావిస్తోన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications